WPL Auction 2024 : 30 ఖాళీలు.. 165 మంది పోటీ.. రూ. 50లక్షల బేస్‌ ప్రైజ్‌లో ఎవ‌రంటే..?

WPL Auction : టాటా ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రెండో ఎడిష‌న్‌కు సంబంధించిన ప్లేయ‌ర్ల వేలం డిసెంబ‌ర్ 9న‌ ముంబైలో జ‌ర‌గ‌నుంది.

WPL Auction 2024

టాటా ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రెండో ఎడిష‌న్‌కు సంబంధించిన ప్లేయ‌ర్ల వేలం డిసెంబ‌ర్ 9న‌ ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో 165 మంది క్రికెట‌ర్లు వేలం కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. ఇందులో 104 మంది భార‌త క్రికెట‌ర్లు కాగా, 61 మంది విదేశీ ప్లేయ‌ర్లు. వీరిలో 15 మంది అసోసియేట్ దేశాల‌కు చెందిన వారు ఉన్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ 109 మంది కాగా.. అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్లు 56 మంది ఉన్నారు.

ఐదు జట్లలోని మొత్తం ఖాళీలను క‌లుప‌గా 30 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 9 స్లాట్లు విదేశీ ప్లేయ‌ర్లవే. డియాండ్రా డాటిన్, కిమ్ గార్త్ లు అత్య‌ధికంగా రూ.50ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. మ‌రో న‌లుగురు ప్లేయ‌ర్లు రూ.40ల‌క్ష‌ల‌తో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. క‌నీసం రూ.10లక్ష‌ల‌తో ప్లేయ‌ర్లు వేలంలోకి వ‌చ్చారు.

Greatest Batters of all time : ఆల్ టైమ్ గ్రేట్ ఇండియన్ బ్యాట‌ర్ ఎవ‌రు..? స‌చిన్, కోహ్లీ కాదా..? మరి ఇంకెవ‌రంటే..?

ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత మొత్తం ఉంది..? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..?

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..

ఆటగాళ్ల సంఖ్య – 15,
విదేశీ ఆటగాళ్ల సంఖ్య-5,
ఖర్చు చేసిన న‌గ‌దు రూ.11.25 కోట్లు,
అందుబాటులో ఉన్న న‌గ‌దు రూ. 2.25 కోట్లు
అందుబాటులో ఉన్న స్లాట్లు: 3
ఓవర్సీస్ స్లాట్లు – 1

గుజరాత్ జెయింట్స్..

ఆటగాళ్ల సంఖ్య – 8
విదేశీ ఆటగాళ్ల సంఖ్య – 3
ఖర్చు చేసిన డబ్బు రూ.7.55 కోట్లు
అందుబాటులో ఉన్న న‌గ‌దు రూ.5.95 కోట్లు
అందుబాటులో ఉన్న స్లాట్లు -10
ఓవర్సీస్ స్లాట్లు- 3

ముంబై ఇండియ‌న్స్‌..

ఆటగాళ్ల సంఖ్య -13
విదేశీ ఆటగాళ్ల సంఖ్య – 5
ఖర్చు చేసిన డబ్బు రూ. 11.4 కోట్లు
అందుబాటులో న‌గ‌దు రూ.2.1 కోట్లు
అందుబాటులో ఉన్న స్లాట్లు – 7
ఓవర్సీస్ స్లాట్లు- 1

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..

ఆటగాళ్ల సంఖ్య -11
విదేశీ ఆటగాళ్ల సంఖ్య- 3
ఖర్చు చేసిన న‌గ‌దు రూ.10.15 కోట్లు
అందుబాటులో ఉన్న న‌గ‌దు రూ.3.35 కోట్లు
అందుబాటులో ఉన్న స్లాట్లు – 7
ఓవర్సీస్ స్లాట్లు: 3

UP వారియర్..

ఆటగాళ్ల సంఖ్య: 13
విదేశీ ఆటగాళ్ల సంఖ్య: 5
ఖర్చు చేసిన డబ్బు రూ.9.5 కోట్లు
అందుబాటులో ఉన్న న‌గ‌దు రూ. 4 కోట్లు
అందుబాటులో ఉన్న స్లాట్లు – 5
ఓవర్సీస్ స్లాట్లు- 1

IPL 2024 Auction : 77 స్థానాలు.. 1166 మంది పోటీ.. ట్రావిస్ హెడ్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌ల బేస్‌ప్రైజ్ ఎంతంటే..?