IPL 2024 Auction : 77 స్థానాలు.. 1166 మంది పోటీ.. ట్రావిస్ హెడ్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌ల బేస్‌ప్రైజ్ ఎంతంటే..?

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నాయి.

IPL 2024 Auction : 77 స్థానాలు.. 1166 మంది పోటీ.. ట్రావిస్ హెడ్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌ల బేస్‌ప్రైజ్ ఎంతంటే..?

IPL 2024 Auction

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నాయి. డిసెంబ‌ర్ 19న మినీ వేలం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అన్ని ఫ్రాంచైజీలు కొంత మంది ఆట‌గాళ్ల‌ను వ‌దులుకున్నాయి. మినీ వేలం కోసం బీసీసీఐ పిలుపు నివ్వ‌గా 1166 మంది ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. ఇందులో 830 మంది భార‌త ఆట‌గాళ్లు ఉండ‌గా 336 విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్లు 909 మంది కాగా, 202 మంది అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన వారు ఉన్నారు. మ‌రో 45 మంది అసోసియేట్ నేష‌న్ ఆట‌గాళ్లు ఉన్నారు.

అన్ని ప్రాంఛైజీల్లో క‌లిపి 77 ఖాళీలు మాత్ర‌మే ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ క్రికెట‌ర్ల‌ను తీసుకోవ‌చ్చు. మినీ వేలం కోసం ద‌రఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది స్టార్ ఆట‌గాళ్లు ఉన్నాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆరో సారి ఆస్ట్రేలియా గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, పాట్ క‌మిన్స్‌, మిచెల్ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్‌లు ఉన్నారు. వీరంతా త‌మ క‌నీస ధ‌ర‌ను రూ.2 కోట్లుగా పేర్కొన్నారు. టీమ్ఇండియా ఆట‌గాళ్లు కేదార్ జాద‌వ్‌, ఉమేశ్ యాద‌వ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు కూడా త‌మ క‌నీస ధ‌ర‌ను రూ.2కోట్లుగా రిజిస్ట‌ర్ చేసుకున్నారు.

Also Read: టీ20ల్లో టీమ్ఇండియా వ‌ర‌ల్డ్ రికార్డు.. పాకిస్తాన్ మ‌న వెన‌కే..

ఇక న్యూజిలాండ్ జ‌ట్టు త‌రుపున వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అల‌రించిన ర‌చిన్ ర‌వీంద్ర సైతం త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకున్నాడు. అత‌డు త‌న క‌నీస ధ‌ర‌ను రూ.50ల‌క్ష‌లుగా పేర్కొన్నాడు. ఆల్‌రౌండ‌ర్ అయిన ర‌చిన్ కోసం ప్రాంఛైజీలు మినీవేలంలో పోటీప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో అత‌డి బేస్ ప్రైస్‌క‌న్నా 15 నుంచి 20 రెట్ల అధిక మొత్తానికి అమ్ముడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని క్రికెట్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. బెంగ‌ళూరు జ‌ట్టు విడుదల చేసిన శ్రీలంక స్టార్ ఆట‌గాడు వనిందు హసరంగా త‌న బ్రేస్ ప్రైజ్‌ను రూ.1.5 కోట్ల గా పేర్కొన్నాడు.

1166 మంది ఆట‌గాళ్లు మినీ వేలం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా వీరిలో ఫ్రాంచైజీలు ఆస‌క్తి క‌న‌బ‌రిచిన వారితో షార్ట్ లిస్ట్‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త‌యారు చేయ‌నుంది. డిసెంబ‌ర్ 19న దుబాయ్ వేదిక‌గా మినీవేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

Also Read : ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ఘోర అవ‌మానం..! వీడియో