Pakistan Cricket Team : ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ఘోర అవ‌మానం..! వీడియో

Pakistan Cricket Team In Australia : మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆట‌గాళ్లు శుక్ర‌వారం ఆసీస్ చేరుకున్నారు.

Pakistan Cricket Team : ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ఘోర అవ‌మానం..!  వీడియో

Pakistan Cricket Team In Australia

పాకిస్తాన్ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆట‌గాళ్లు శుక్ర‌వారం ఆసీస్ చేరుకున్నారు. కాగా.. విమానాశ్ర‌యంలో పాక్ ఆట‌గాళ్ల‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. ప్లేయ‌ర్ల‌కు ఎలాంటి స్వాగ‌తం ల‌భించ‌లేదు. పాకిస్తాన్ దౌత్య అధికారులు గానీ, క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌తినిధులు గానీ పాక్ ఆట‌గాళ్ల‌కు వెల్‌క‌మ్ చెప్పేందుకు విమానాశ్ర‌యానికి రాలేదు.

అంతెందుకు క‌నీసం ఆట‌గాళ్ల లగేజ్‌ను తీసుకువెళ్లేందుకు కూడా సిబ్బందిని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఏర్పాటు చేయ‌లేదు. దీంతో పాకిస్తాన్ ఆట‌గాళ్లు స్వ‌యంగా త‌మ ల‌గేజీని తామే మోసుకుంటూ వెళ్లి పిక‌ప్ వ్యాన్‌లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై పాకిస్తాన్ అభిమానులతో పాటు నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.

Mitchell Marsh : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ వివాదం.. ఎట్ట‌కేల‌కు స్పందించిన మిచెల్ మార్ష్‌.. ఇందులో త‌ప్పేముంది..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆరో సారి సొంతం చేసుకోవ‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు గ‌ర్వం త‌ల‌కెక్కింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ దేశానికి వ‌చ్చిన జ‌ట్ల‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం ఆతిథ్య క్రికెట్ బోర్డుల క‌నీస బాధ్య‌త అని, ఈ విష‌యం క్రికెట్ ఆస్ట్రేలియా మ‌రిచిపోయిన‌ట్లుగా ఉంద‌ని అంటున్నారు. కాగా.. సీఏ ఇలా చేయ‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తంలోనూ ప‌లు జ‌ట్ల విష‌యంలోనూ ఇలాగే చేసిందని గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో పాకిస్తాన్ జ‌ట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ ఆజాం త‌ప్పుకున్నాడు. దీంతో టెస్టుల‌కు షాన్ మసూద్ ను కెప్టెన్‌గా నియ‌మించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). కొత్త కెప్టెన్ నేత‌తృత్వంలో పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. డిసెంబ‌ర్ 14 నుంచి 18 వ‌ర‌కు మొద‌టి జ‌ట్లు మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, 26 నుంచి 30 వ‌ర‌కు రెండో టెస్టు, జ‌న‌వ‌రి మూడు నుంచి 7 వ‌ర‌కు మూడో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs SA : రోహిత్‌, కోహ్లీ ద‌క్షిణాఫ్రికాతో టీ20, వ‌న్డేలు ఎందుకు ఆడ‌డం లేదు.. ఇక వారి కెరీర్ ముగిసిన‌ట్లేనా..?