WPL 2024 : ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ జట్టు.. ఆటగాళ్ల సంబరాలు చూశారా.. వీడియో వైరల్

మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది.

WPL 2024 RCB

WPL 2024 : మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)- 2024 టోర్నీలో స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఐదు పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టుపై విజయం సాధించింది. దీంతో.. ఇప్పటికే ఫైనల్ కు వెళ్లిన ఢిల్లీ జట్టుతో ఆర్సీబీ జట్టు ఆదివారం ఢిల్లీ మైదానంలో తలపడనుంది. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు పైచేయి సాధించింది.

Also Read : హార్ధిక్, బుమ్రాలు ముంబై జట్టులో కొనసాగడానికి రోహిత్ శర్మనే కారణం.. పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభంలో పేవలంగా సాగింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మందాన కేవలం 10 పరుగులకే ఔట్ అయింది. కష్టాల్లో ఉన్న ఆర్సీబీ జట్టును ఎల్లిస్ ఫ్యారీ ఆదుకుంది. ఎల్లిస్ 50 బంతుల్లో 66 పరుగులు చేసింది. చివర్లో జార్జియా వేర్ హామ్ 10 బంతుల్లో 18 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 135 పరుగులకు చేరింది. 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఆటగాళ్లు ధాటిగా ఆడలేక పోయారు. దీంతో 10 ఓవర్లకు 68 పరుగులు చేసినా మూడు వికెట్లు కోల్పోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయింది. దీంతో మ్యాచ్ క్రమంగా ఆర్సీబీ జట్టువైపు మళ్లింది.

Also Read : Rishabh Pant : ప్రాక్టీస్ సెష‌న్‌లో సిక్సర్ల మోతమోగించిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతులకు నాలుగు పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి పూజ (4)ను ఔట్ అయింది. ఆ తరువాతి రెండు బంతులకు రెండే పరుగులు రావడంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు మాత్రమే చేయగిలిగింది. దీంతో ఆర్సీబీ జట్టు విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఫైనల్స్ కు చేరడంతో ఆర్సీబీ జట్టు ప్లేయర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు