Rishabh Pant : ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్ల మోతమోగించిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ తరపున బరిలోకి దిగనున్న పంత్.. ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.

Rishabh Pant
Rishabh Pant Practice Session : ఐపీఎల్ 17వ సీజన్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకోసం క్రికెట్ అభిమానులు ఉత్సకతతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అందరిచూపు రిషబ్ పంత్ పై ఉంది. డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. అప్పటి నుంచి క్రికెట్ దూరమయ్యాడు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవటంతో క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ తరపున పంత్ మైదానంలోకి దిగనున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ విషయాన్ని వెల్లడించింది. పంత్ ఫిట్ గా ఉన్నాడని, ఐపీఎల్ లో ఆడుతున్నాడని తెలిపింది. దీంతో దాదాపు 14 నెలలపాటు ఆటకూ దూరంగా ఉన్న పంత్ మైదానంలోకి దిగనున్నాడు.
Also Read : Rishabh Pant : శుభవార్త.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటన
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ తరపున బరిలోకి దిగనున్న పంత్.. ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నాడు. ప్రధానంగా బ్యాటింగ్, కీపింగ్ పై పంత్ దృష్టి కేంద్రీకరించాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్ లో పంత్ నిలబడి సిక్స్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈసారి ఐపీఎల్ లో పంత్ సిక్సర్ల మోత ఖాయమంటూ పేర్కొంటున్నారు. మరోవైపు సుమారు 14 నెలల తరువాత పంత్ మైదానంలో అడుగిడుతున్న నేపథ్యంలో అందరిచూపు అతని పైనే ఉంది.
Also Read : RCB : పేరు మార్పుపై హింట్ ఇచ్చిన ఆర్‌సీబీ! అలాఐనా కలిసివస్తుందా?
Rishabh Pant in the practice session is looking unbelievable. ⭐https://t.co/nXmLXT5WyO
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2024
https://twitter.com/kkgrandhiDC/status/1767971567705927823?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1767971567705927823%7Ctwgr%5E60de622e996ea17ab013095a5e130e80f751fdb0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fcricket%2Fwatch-rishabh-pants-monstrous-shot-during-delhi-capitals-training-session-ahead-of-ipl-2024-8815056.html