×
Ad

WPL 2026 Auction : డబ్ల్యూపీఎల్‌ వేలం.. RTM ఉపయోగించి ఏ జట్టు ఏ ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు? ఫుల్ డీటెయిల్స్ ఇవే..

WPL 2026 Auction ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకున్న భారత ప్లేయర్లకు వేలంలో భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

WPL 2026 Auction

WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి న్యూఢిల్లీ వేదికగా వేలం ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాలు ఖాళీ ఉండగా.. వీటికోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఐదు ఫ్రాంచైజీలు కలిపి ఈవేలంలో రూ.41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇందులో అత్యధికంగా యూపీ వారియర్స్ దగ్గర 14.50కోట్లు ఉన్నాయి.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకున్న భారత ప్లేయర్లకు వేలంలో భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మొత్తం వేలంలో 277 మంది ప్లేయర్లు పోటీ పడుతుండగా.. 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52మంది క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడినవారు) ప్లేయర్లు కాగా.. 142 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో జట్టు కనిష్ఠంగా 15మంది, గరిష్ఠంగా 18మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈసారి వేలంలో రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా ఫ్రాంచైజీలు వేలం సమయంలో మాజీ క్రీడాకారిణికి అత్యధిక బిడ్‌ను చెల్లించి ఆమెను తిరిగి పొందేందుకు వీలు ఉంటుంది.

RTM అంటే ఏమిటి ..
ఐపీఎల్ లో పాల్గొనే జట్లకు ఇప్పుడు గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతి ఉంది. జట్టు రెండు ప్రాథమిక పద్దతుల ద్వారా ఆటగాళ్లను నిలుపుకునే అవకాశముంది. వేలం ముందు పూర్తిగా నిలుపుదల (రైటన్), లేదా వేలం సమయంలో రైట్ -టు-మ్యాచ్ (ఆర్టీఎం) ఎంపికలను ఉపయోగించడం ద్వారాకూడా ఆటగాళ్లను తమ జట్టులోకి తసుకునే అవకాశం ఉంది. ఆర్టీఎం నియామకాల ప్రకారం.. జట్లు రిటైన్ చేసే ఆరు మంది ఆటగాళ్లలో ఐదు మంది క్యాప్డ్, ఇద్దరు అన్ క్యాప్డ్ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. వేలం సమయంలో ఆటగాళ్లపై ఇతర జట్లు అత్యధిక బిడ్ పెట్టినప్పటికీ అసలు జట్టు ఆ బిడ్ తో సంబంధం లేకుండా ఆటగాళ్లను తిరిగి పొందవచ్చు.

డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో జట్లు RTM ఎంపికను ఉపయోగించుకోగల కొంతమంది ఆటగాళ్లను ఇక్కడ తెలుసుకుందాం..
యూపీ వారియర్జ్ (నాలుగు ఆర్టీఎంలు) – అలిస్సా హీలీ, దీప్తి శర్మ, కిరణ్ నవ్‌గిరే, సోఫీ ఎక్లెస్టోన్
గుజరాత్ జెయింట్స్ (మూడు ఆర్టీఎంలు ) : లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఒక ఆర్టీఎం) : రేణుకా సింగ్ ఠాకూర్.
ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్‌ జట్లు వేలానికి ముందు ఐదుగురు ప్లేయర్లను రీటైన్‌ చేసుకున్నాయి. దీంతో వేలంలో ఈ రెండు జట్లకు ‘రైట్‌ టు మ్యాచ్‌‘ అవకాశం లేదు.

ఫ్రాంచైజీల వద్ద ఉన్న డబ్బు, మిగిలిన స్లాట్లు..
యూపీ వారియర్స్ – రూ. 14.50 కోట్లు – 17 స్లాట్లు
గుజరాత్ జెయింట్స్- రూ. 9 కోట్లు- 16 స్లాట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 6.15 కోట్లు- 13 స్లాట్లు
ముంబయి ఇండియన్స్- రూ. 5.75 కోట్లు – 13 స్లాట్లు
దిల్లీ క్యాపిటల్స్- రూ. 5.75 కోట్లు -13 స్లాట్లు