WPL 2026
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ -2026లో భాగంగా సోమవారం రాత్రి వడోదర వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళల జట్టు ఓటమి పాలైంది. ఈ టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తరువాత ముంబై ఇండియన్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Also Read : T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ పై పాకిస్థాన్ కొత్త డ్రామా..!
ఈ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ సెంచరీతో అదరగొట్టింది. దీంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. నాట్ స్కివర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇందులో 16ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌కు చెందిన మరో బ్యాటర్ హీలీ మాథ్యూస్ (56) రాణించింది.
The moment 📸
The ball 💯
The celebration 🥳Natalie Sciver-Brunt, forever etched in the history books 🫡
Updates ▶️ https://t.co/yUHXkzVIZw #TATAWPL | #KhelEmotionKa | #RCBvMI | @mipaltan pic.twitter.com/i2xECl5jyB
— Women’s Premier League (WPL) (@wplt20) January 26, 2026
భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్ చేసింది. క్రీజులో ఉన్నంత సేపు బ్యాటుతో విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఆమె 50 బంతుల్లోనే 10ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 90 పరుగులు చేసింది. అయితే, రిచా ఘోష్ మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యారు. దీంతో ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేక ఓటమి పాలైంది.
RICHA GHOSH – THE BEST SIX HITTER OF INDIAN WOMEN’S TEAM.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2026
ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయాంకా పాటిల్, ఎన్‌డి క్లార్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు తీశారు.