×
Ad

డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనుంది.

WPL 2026 schedule

WPL 2026 schedule: మహిళల ప్రీమియర్ లీగ్ నాల్గో ఎడిషన్ (డబ్ల్యూపీఎల్ 2026) జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియం, వడోదర బీసీఏ స్టేడియంలో మ్యాచులు జరగనున్నాయి.

నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలోనే మహిళల ప్రపంచకప్ ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఇదే స్టేడియాంలో డబ్ల్యూపీఎల్ ఈ నాల్గో సీజన్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్‌ వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరగనుంది.

  • 2023లో ముంబై ఇండియన్స్ (134/3, 19.3 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (115/2.. 19.3 ఓవర్లు) 8 వికెట్ల తేడాతో గెలిచింది.
  • 2025లో ముంబై ఇండియన్స్ (149/7.. 20 ఓవర్లు) 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా, డబ్ల్యూపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది.

ఏ సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలిచింది?

సీజన్ విజేత తేడా
2023 ముంబై ఇండియన్స్ 134/3 (19.3 ఓవర్లు) ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం
2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 115/2 (19.3 ఓవర్లు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం
2025 ముంబై ఇండియన్స్ 149/7 (20 ఓవర్లు) ముంబై ఇండియన్స్ 8 పరుగుల తేడాతో విజయం