Sagar Rana Murder : రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టు

ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ని రోజులు అతను అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.

Wrestler Sushil Kumar

Wrestler Sushil Kumar Arrested : ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ని రోజులు అతను అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇతని ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు కూడా ప్రకటించారు. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణాపై దాడి చేయడంతో అతను మృతి చెందాడని సుశీల్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సాగర్ చనిపోయినప్పటి నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇతడి కోసం 8 పోలీసు బృందాలు గాలింపులు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు పంజాబ్ రాష్ట్రంలో పట్టుబడ్డాడు. యూపీలోని మీరట్ టోల్ ప్లాజా మీదుగా కారులో వెళుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఇతని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఫొటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పంజాబ్ రాష్ట్రానికి వెళ్లాడని పోలీసులు నిర్ధారించారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. సుశీల్ కుమార్ తో పాటు అజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2021, మే మొదటి వారంలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా చనిపోయాడు. సాగర్ పై దాడి చేసిన వారిలో రెజ్లర్ సుశీల్ ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

Read More : Covid Patient : శ్మశాన వాటికల్లో అదనపు వసూళ్లకు చెక్‌…ధరల పట్టిక ప్రదర్శన