వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం.. కన్నీరు పెట్టుకున్న రెజ్లర్.. ఓదార్చిన కాంగ్రెస్ ఎంపీ, సన్నిహితులు

వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ... నాదేశ ప్రజల నుంచి నాకు లభించిన ఈ ప్రేమ, గౌరవానికి నేను కృతజ్ఞతురాలినని పేర్కొన్నారు. వినేశ్ తన స్వగ్రామమైన చర్కీదాద్రీకి ర్యాలీగా వెళ్లారు.

Vinesh Phogat Return to India

Vinesh Phogat Return to India : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత్ చేరుకున్నారు. పారిస్ నుంచి బయలుదేరిన ఆమె శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వినేశ్ ఫొగాట్ సన్నిహితులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను, తన సన్నిహితులను చూసి వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, తదితరులు దగ్గరకు తీసుకొని ఓదార్చారు. విమానాశ్రయం బయటకు డప్పు నృత్యాలతో అభిమానులు వినేశ్ పొగ్రాట్ కు పెద్దుత్తున స్వాగతం పలికారు.

Also Read : Karnataka : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాకిచ్చిన గవర్నర్.. విచారణకు అనుమతి

ఈ సందర్భంగా సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. దేశంకోసం ఆమె ఏం చేసిందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. ఆమె ఈ ప్రశంసలు, గౌరవానికి అర్హురాలేనని అన్నారు. వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ… నాదేశ ప్రజల నుంచి నాకు లభించిన ఈ ప్రేమ, గౌరవానికి నేను కృతజ్ఞతురాలినని పేర్కొన్నారు. వినేశ్ తన స్వగ్రామమైన చర్కీదాద్రీకి వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. పలువురు జాతీయ జెండాలను చేతభూమి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.

పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన వినేశ్.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టివేసింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు