WTC Final 2023: ఓటమి అంచుల్లో టీమిండియా.. విజయం సాధించాలంటే 121ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాల్సిందేనా..

ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే.

Ind vs Aus WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2023) ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా  (Team India) ఓటమి అంచుల్లోకి వెళ్లింది. లండన్‌లోని ఓవల్ మైదానం (Oval ground) లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడు రోజుల ఆట ముగిసింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అంతకుము ముందు తొలి ఇన్సింగ్స్ లో ఆస్ట్రేలియా  (Australia) 469 పరుగుల చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారత్ పై 173 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో వెళ్లింది. నాల్గోరోజు మ్యాచ్‌లో కంగారు జట్టు భారీ స్కోర్ సాధిస్తే టీమిండియాకు ఓటమి గండం పొంచిఉన్నట్లే.

WTC Final 2023: ప‌టిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఆధిక్యం 296 ప‌రుగులు.. టీమ్ఇండియాకు క‌ష్ట‌మే..!

ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే 121 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాల్సిందే. ఓవల్ మైదానం రికార్డు చూస్తే అద్భుతాలు జరిగితే తప్ప టీమిండియా విజయం సాధ్యంకాదు. ఈ స్టేడియంలో అత్యధిక ఛేదన 263 మాత్రమే. అదికూడా ఎప్పుడో 121ఏళ్ల కిందట (1902 సంవత్సరంలో) ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం 296కు చేరుకుంది. ఆ జట్టు చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. నాలుగో రోజు ఆటలో ఇండియాకు భారీ టార్గెట్ విధించే అవకాశం ఉంది.

WTC Final 2023: బాలకృష్ణ డైలాగులు చెబుతూ అదరగొట్టేసిన స్టీవ్ స్మిత్.. వీడియో

ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే. చివరి రెండు రోజుల్లో వర్షం పలుకరించి, రిజర్వ్ డే రోజుకూడా వర్షం పడితే భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది.

WTC Final 2023: టీమ్ ఇండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 ర‌న్స్ ఆధిక్యం

ఇదిలాఉంటే.. 121ఏళ్ల క్రితం ఓవల్ పిచ్ వేరు. ప్రస్తుతం పిచ్ వేరు. భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఆస్ట్రేలియా నాలుగో రోజు భారీ స్కోర్ సాధించి 400 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టుకు నిర్దేశించినప్పటికీ రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి బ్యాటర్లు రాణిస్తే భారత్ జట్టు ఎలాంటి కష్టతరమైన ఫలితాన్నైనా సాధించే అవకాశాలు ఉంటాయని పలువురు మాజీ క్రికెట్లు పేర్కొంటున్నారు.

 

ఓవల్‌లో అతిపెద్ద లక్ష్యాలను ఛేదించిన జట్లు ఇవే..

– 1902 ఆగస్టు 11న ఇంగ్లాండ్ (263/9) ఒక వికెట్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
– 1963 ఆగస్టు 22న వెస్టిండీస్ (255/2) ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
– 1972 ఆగస్టు 10న ఆస్ట్రేలియా (242/5) ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
– 1988 ఆగస్టు 4న వెస్టిండీస్ జట్టు (226/2) ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది.

ట్రెండింగ్ వార్తలు