IND vs NZ : చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్‌.. కోహ్లీ, రోహిత్, స‌చిన్‌, ధోని వ‌ల్ల కాలేదు..

టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Yashasvi Jaiswal Joins Elite 1000 Test Run Club Before 23

IND vs NZ : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీమ్ఇండియా త‌రుపున ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో టెస్టుల్లో 1000 ప‌రుగులు చేసిన అతి పిన్న వ‌య‌స్కుడిగా చ‌రిత్ర సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు దిలీప్ వెంగ్‌స‌ర్కార్ పేరిట ఉండేది. 1979లో 23 ఏళ్ల వ‌య‌సులో దిలీప్ ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో టెస్టుల్లో 1000 ప‌రుగులు చేయ‌గా.. 22 ఏళ్ల య‌శ‌స్వి పూణె వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఈ ఘ‌న‌తను సాధించాడు.

పూణె టెస్టుతో క‌లిపి ఈ ఏడాది య‌శ‌స్వి 10 టెస్టులు ఆడాడు. 59.23 సగటుతో 75.88 స్ట్రైక్‌రేటుతో 1007 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, రెండు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది అత్య‌ధిక ప‌రుగులు సాధించిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆట‌గాడు జో రూట్ 14 మ్యాచుల్లో 1305 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Team India : టీమ్ఇండియా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. సీనియ‌ర్ పేస‌ర్ వ‌చ్చేస్తున్నాడు.. ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌బిడిదిబిడే

ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే 23 ఏళ్ల వయస్సులోపు 1000+ పరుగులు చేసిన అయిదో బ్యాటర్‌గా య‌శ‌స్వి నిలిచాడు. 1958లో గార్ఫీల్డ్ సోబెర్స్ 1193 పరుగులు, 2003లో గ్రేమ్ స్మిత్ 1198 పరుగులు, 2005లో ఏబీ డివిలియర్స్ 1008 పరుగులు, 2006లో అలెస్టర్ కుక్ 1013 పరుగులు చేశారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో రవీంద్ర జడేజా (38), జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (30) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. దీంతో న్యూజిలాండ్‌కు కీల‌క‌మైన 103 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అంత‌క‌ముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

IND vs NZ : డ‌కౌట్ల కెప్టెన్లు.. ధోని స‌ర‌స‌న రోహిత్ శ‌ర్మ‌.. అగ్ర‌స్థానంలో కోహ్లీ..