Vivek Sagar Olympic medal: ఒలింపిక్ మెడల్ తాకి కన్నీరు పెట్టుకున్న క్రీడా మంత్రి
క్రీడా మంత్రి యశోధర రాజె సింధియా ఎమోషనల్ అయ్యారు. ఒలింపిక్ పతక విజేత వివేక్ సాగర్ ను భోపాల్ ఎయిర్‌పోర్టులో కలుసుకుని.. పతకాన్ని తాకి కన్నీరు..

Hockey Olympic Medal
Vivek Sagar Olympic medal: మధ్యప్రదేశ్ క్రీడా మంత్రి యశోధర రాజె సింధియా ఎమోషనల్ అయ్యారు. ఒలింపిక్ పతక విజేత వివేక్ సాగర్ ను భోపాల్ ఎయిర్‌పోర్టులో కలుసుకుని.. పతకాన్ని తాకి కన్నీరు పెట్టుకోవడమే కాకుండా నుదుటికి హత్తుకున్నారు. సింధియా నెలకొల్పిన హాకీ అకాడమీలోనే వివేక్ శిక్షణ తీసుకున్నాడు.
21 సంవత్సరాల వయస్సున్న వివేక్‌కు.. రాష్ట్ర డీసీపీ జాబ్ ఆఫర్ ఇచ్చారు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్. దాంతో పాటుగా కోటి రూపాయలు విలువ చేసే క్యాష్ రివార్డు కూడా అందజేశారు. ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చి స్కూల్ టీచర్ అయిన తన తండ్రి రోహిత్ సాగర్ మెడలో వేయగానే ఆ పేరెంట్స్ కంటనీరు పెట్టుకున్నారు.
ఉద్యోగం రావాలంటే క్రీడలు రావలని చదువు మీద ఫోకస్ పెట్టాలని అతని తండ్రి కొన్నిసార్లు ఆపేసేవారట. టోక్యో నుంచి రాగానే వివేక్ కు భోపాల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం అందుకున్నాడు వివేక్. ఐదు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీం కాంస్య పతకం సాధించింది.