Cricket 2021: ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో టాప్-5 బ్యాట్స్‌మెన్లు వీరే!

ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో ఐరిష్ బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక పరుగులు చేసి టాప్‌లో ఉన్నారు.

Top Five

Cricket 2021: ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో ఐరిష్ బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక పరుగులు చేసి టాప్‌లో ఉన్నారు. ఐరీష్ జట్టు బ్యాట్స్‌మెన్ PR స్టెర్లింగ్ 2021లో వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతనితో పాటు మరో ఇద్దరు ఐరిష్ బ్యాట్స్‌మెన్‌లు కూడా టాప్-5 లిస్ట్‌లో చేరారు. ఈ టాప్-5 లిస్ట్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి టాప్ జట్లు నుంచి ఎవరూ లేకపోవడం విశేషం.

కరోనా మహమ్మారి కారణంగా, పెద్ద క్రికెట్ జట్లు ఈ ఏడాది తక్కువగా క్రికెట్‌ను ఆడాయి. ముఖ్యంగా వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు చాలా తక్కువగా జరిగాయి. క్రికెట్‌లోని కొత్త జట్లే పెద్ద జట్ల కంటే ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడాయి. వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో పెద్ద జట్ల ఆటగాళ్లు లేకపోవడానికి ఇదే కారణం.

2021 టాప్-5 బ్యాట్స్‌మెన్లు వీరే:
1. పాల్ స్టిర్లింగ్: ఐర్లాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ 2021 వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాల్ స్టిర్లింగ్ ఈ ఏడాది 14 వన్డేల్లో 54 సగటుతో 705 పరుగులు చేశాడు. 2021లో మొత్తం మూడు సెంచరీలు చేశాడు పాల్ స్టిర్లింగ్.

2. JN మలన్: ఈ దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది 8 వన్డేల్లో 84 సగటుతో 509 పరుగులు చేశాడు. మలన్ 92 స్ట్రైక్ రేట్‌తో 2 సెంచరీలు మరియు 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. పెద్ద జట్ల నుంచి ఈ జాబితాలో ఉన్న ఏకైక ఆటగాడు అతనే.

3. తమీమ్ ఇక్బాల్: బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్ ఇక్బాల్ 2021 సంవత్సరంలో 12 మ్యాచ్‌ల్లో 38 సగటుతో 464 పరుగులు చేశాడు. అతను 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు చేశాడు.

4. హ్యారీ టెక్టర్: ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు చేసిన టాప్-5లో రెండో ఐరిష్ ఆటగాడు హ్యారీ టెక్టర్. ఈ ఐరిష్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది 14 వన్డేల్లో 37 సగటుతో 454 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెక్టర్ పేరిట 4 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

5. ఆండీ బల్బిర్నీ: ఐరిష్ స్పిన్నర్ ఆండీ బల్బిర్నీ.. ఈ ఏడాది తన బ్యాట్‌తో కూడా రాణించాడు. ఆండీ 14 వన్డేల్లో 32 సగటుతో 421 పరుగులు చేశాడు. అతని పేరు మీద ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.