RCB vs CSK
IPL 2023, RCB vs CSK: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించింది. బౌండరీల వర్షంలో ప్రేక్షకులు తడిసిముద్ద అయ్యారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపు, ఓటముల సంగతి కాస్త పక్కన పెడితే ఈ మ్యాచ్‌లో ఓ చిన్నోడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ చూసేందుకు ఆర్‌సీబీ జెర్సీలో వచ్చిన ఓ బుడ్డొడు విరాట్ అంకుల్.. వామికను డేట్‌కు తీసుకుని వెళ్లొచ్చా అని రాసిఉన్న ఫ్లకార్లును పట్టుకున్నాడు. ఇది నెటీజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. కొందరు దీనిని ఫన్నీగా తీసుకుంటే మరికొందరు కొందరు మండిపడుతున్నారు. ఇందులో ఆ చిన్నోడి తప్పు ఏమీ లేదని, ఆ చిన్నారికి ఏం తెలువదని, ఆ పిల్లవాడి తల్లిదండ్రులే ఇలా చేయించి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే ఇలాంటి పనులు చేస్తుంటారని మండిపడుతున్నారు. పెంపకంలో లోపం ఉంటే ఆ చిన్నోడి భవిష్యత్తు ఏంటని పలువురు ఆందోళన చెందుతున్నారు.
This kid wants vamika on a date ? pic.twitter.com/7MzK3fVY2z
— Abdul Khan (@Immortal_abdul) April 18, 2023
జనవరి 11, 2021 సంవత్సరంలో విరాట్ కోహ్లి-అనుష్క దంపతులకు కూతురు జన్మించింది. వారి కూతురికి వామికా అని నామకరణం చేశారు. తమ కూతురిని సెలబ్రెటీ హోదాకు దూరంగా పెంచుతామని ఇప్పటికే పలు సందర్భాల్లో విరుష్క జంట పలుమార్లు చెప్పింది. వామిక ఎలా ఉంటుంది అన్నది బయటి వారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బయటకు వెళ్లినప్పుడల్లా వామిక ముఖం కనిపించకుండా ఆమె ఫేస్‌ను కవర్ చేసక్తున్నారు. వామిక ఫొటోలను తీయవద్దని విరుష్క దంపతులు విజ్ఞప్తి చేస్తూ లేఖను రాసిన సంగతి తెలిసిందే.