young girl bowling
Jasprit Bumrah Bowling Action : ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఒకరు. బాల్ పట్టాడంటే క్రీజులో ఉన్న బ్యాటర్లకు ఆందోళన మొదలవుతుంది. బుమ్రా బౌలింగ్ నుంచి చురకత్తుల్లా దూసుకొచ్చే బంతులను సమర్ధవంతంగా ఆడాలంటే ఎంతో అనుభవం ఉండాలి. అయినాసరే, పలు సందర్భాల్లో బుమ్రా వేసే యార్కర్లకు వికెట్లు సమర్పించుకోవాల్సిందే. బుమ్రా బౌలింగ్ యాక్షన్ అందరికంటే భిన్నంగా ఉంటుంది. క్రికెట్ పై ఆసక్తి కలిగిన ప్రతీఒక్కరూ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఓ స్కూల్ విద్యార్థిని బుమ్రా బౌలింగ్ యాక్షన్ తో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు లేడీ బుమ్రా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Rohit sharma : ముంబై వీధుల్లో లంబోర్గినీ కారులో రోహిత్ శర్మ చక్కర్లు.. కారు నెంబర్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ఈ వీడియోలో ఓ విద్యార్థిని స్కూల్ యూనిఫాంలో నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. ఆమె బౌలింగ్ యాక్షన్ చూస్తే.. అచ్చం బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను గుర్తుచేస్తుంది. మైదానంలో దూరం నుంచి బుమ్రా ఏ విధంగా రన్ చేసుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తాడో అదే తరహాలో ఆమె బౌలింగ్ చేస్తుండటంతోపాటు.. ఆమె బౌలింగ్ స్పీడ్ కూడా అదే తరహాలో ఉండటంతో వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. లేడీ బుమ్రా వచ్చేసిదంటూ పేర్కొంటున్నారు.
Also Read : Dinesh Karthik : ధోని పై అక్కసుతోనే దినేశ్ కార్తీక్ ఇలా చేశాడా..?
టీమిండియా తరపున జస్ర్పీత్ బుమ్రా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతను 36 టెస్టులు, 89 వన్డేలు, 70 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 159, వన్డేల్లో 149, టీ20 ల్లో 89 వికెట్లు తీశాడు.
The Impact and Influence of Jasprit Bumrah.?
– A young girl bowling in the Jasprit Bumrah’s action. ?pic.twitter.com/zRTu8mZvIJ
— Tanuj Singh (@ImTanujSingh) August 17, 2024