Rohit sharma : ముంబై వీధుల్లో లంబోర్గినీ కారులో రోహిత్ శర్మ చక్కర్లు.. కారు నెంబర్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

భారత్ జట్టు చివరిసారిగా శ్రీలంక జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది.

Rohit sharma : ముంబై వీధుల్లో లంబోర్గినీ కారులో రోహిత్ శర్మ చక్కర్లు.. కారు నెంబర్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Rohit Sharma Driving His Lamborghini Car

Updated On : August 17, 2024 / 10:59 AM IST

Rohit Sharma Driving His Lamborghini Car : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. సాదాసీదా కారులో కాదు.. ఖరీదైన లగ్జరీ సౌకర్యాలు కలిగిన లంబోర్గినీ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కారు నెంబర్ ప్లేట్ పై ‘0264’ అని ఉంది. ఈ నెంబర్ ఓ ప్రత్యేకను కలిగి ఉంది. వన్డే ఫార్మాట్ లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తి స్కోర్ తో ఆ నెంబర్ పోలి ఉంటుంది.

Also Read : ICC Rankings : 8 నెల‌లుగా వ‌న్డే ఆడ‌ని బాబ‌ర్‌.. అయినా అగ్ర‌స్థానంలోనే? పాక్ మాజీ ఆట‌గాడి మండిపాటు

2014లో ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంక జట్టుతో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 33 ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో వ్యక్తిగతంగా 264 పరుగులు చేశాడు. ప్రస్తుతం తన నీలిరంగు లంబోర్గినీ కారు ప్లేట్ నెంబర్ గా 0264 వచ్చేలా ఎంచుకున్నాడు.

Also Read : Rishabh Pant : ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌.. బరిలోకి దిగ‌నున్న రిషభ్‌ పంత్!

భారత్ జట్టు చివరిసారిగా శ్రీలంక జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. శ్రీలంకతో వన్డే సిరీస్ లో రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడు ఇన్నింగ్స్ లలో రెండు ఆఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం కాస్త ఖాళీ సమయం దొరకడంతో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దులీప్ ట్రోఫీ జట్టులో రోహిత్ పేరు లేదు. దీంతో అతని తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్ తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ గా ఉండే అవకాశం ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ కు నెలరోజుల కంటే ఎక్కువ సమయమే ఉంది.