ICC Rankings : 8 నెలలుగా వన్డే ఆడని బాబర్.. అయినా అగ్రస్థానంలోనే? పాక్ మాజీ ఆటగాడి మండిపాటు
దాదాపుగా ఎనిమిది నెలలుగా వన్డే మ్యాచ్ ఆడని పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ల్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Ex Pakistan Star Slams ICC Questions Babar Azams Spot At Top
ICC Rankings : దాదాపుగా ఎనిమిది నెలలుగా వన్డే మ్యాచ్ ఆడని పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ల్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బసిత్ అలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐసీసీ పై మండిపడ్డాడు. మ్యాచులు ఆడకపోయినా బాబర్‌కు అగ్రస్థానాన్ని ఐసీసీ కేటాయించడాన్ని తప్పుబట్టాడు. అసలు తనకు ర్యాంకింగ్ సిస్టమ్ అర్థం కావడం లేదన్నాడు.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను చూశాను బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండ స్థానంలో రోహిత్ శర్మ, మూడులో శుభ్‌మన్ గిల్, నాలుగులో విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఇంకా ఆ తరువాత ఎవరెవరు ఉన్నారు అన్నది గుర్తు చేయాల్సిన పని లేదు. బాబర్ మ్యాచ్ ఆడకపోయిన ఫర్వాలేదు అన్నట్లుగా ఐసీసీ తీరు ఉంది అని బాసిత్ విమర్శించాడు.
Dinesh Karthik : ధోని పై అక్కసుతోనే దినేశ్ కార్తీక్ ఇలా చేశాడా..?
నంబర్ వన్ ర్యాంకర్‌గా ఉన్నందుకు బాబర్ అజామ్ సంతోషంగా ఉండి ఉండవచ్చునని, అయితే.. ఇలాంటి ర్యాంకులను ఎవరు ఇస్తున్నారు..? ఏ ప్రాతిపదికన ప్రకారం బాబర్, గిల్ లు ఈ స్థానాల్లో ఉన్నారు అని ప్రశ్నించాడు. వన్డే ప్రపంచకప్‌లో బాబర్ తన చివరి వన్డే ఆడాడు. ఆ తరువాత ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. అయినా అతడి ర్యాంకులో ఎలాంటి మార్పులేదు. అదే విధంగా గిల్ సైతం శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడాడు. లంకతో వన్డేల్లో అద్భుతంగా ఏమీ రాణించలేదన్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీలు వంటి వారు అద్భుతంగా ఆడాడు. ఒక్కొక్కరు మూడు నాలుగు సెంచరీలు సాధించారు. ఇక పాకిస్తాన్ తరుపున రిజ్వాన్, ఫఖర్ జమాన్ లు ఒక్కొక్క శతకం సాధించారని, ర్యాంకుల విధానం సరిగ్గా లేదని అనిపిస్తోందని అలీ చెప్పుకొచ్చాడు.
BCCI : అబ్బే మా వల్ల కాదు.. ఐసీసీకి తేల్చిచెప్పిన బీసీసీఐ.. ఇప్పుడెలా మరీ..?