BCCI : అబ్బే మా వల్ల కాదు.. ఐసీసీకి తేల్చిచెప్పిన బీసీసీఐ.. ఇప్పుడెలా మరీ..?
క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ఉండే క్రేజే వేరు. ఈ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వాలని దాదాపుగా అన్ని దేశాలు భావిస్తుంటాయి.
BCCI : క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ఉండే క్రేజే వేరు. ఈ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వాలని దాదాపుగా అన్ని దేశాలు భావిస్తుంటాయి. ఐసీసీ టోర్నీలను సజావుగా నిర్వహించడం ద్వారా పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు టికెట్లు, మీడియా భాగస్వామి ఇంకా అనేక రూపాల్లో ఆదాయం వస్తుంది. అందుకనే ఈ టోర్నీలను నిర్వహించేందుకు దేశాలు పోటీపడుతుంటాయి. అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ఓ మెగా టోర్నీని నిర్వహించే అవకాశం వచ్చింది. టీ20 ప్రపంచకప్ ను నిర్వహించే ఛాన్స్ వచ్చినా తమ వల్ల కాదంటూ బీసీసీఐ ఇందుకు నో చెప్పింది.
ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తారా అని బీసీసీఐ ని ఐసీసీ అడిగింది.
Virat Kohli : లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
దీనికి నో చెప్పినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఎందుకంటే అక్టోబర్‌లో మన దగ్గర వానకాలం కావడం ఓ కారణం కాగా.. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుందన్నారు. స్వల్ప వ్యవధిలో రెండు ప్రపంచకప్‌లను నిర్వహించడం కాస్త కష్టంతో కూడిన వ్యవహారం అని అన్నారు.
ఇక భారత టీ20 ప్రపంచకప్ నిర్వహణకు నో చెప్పడంతో ఐసీసీ ఇప్పుడు శ్రీలంక, యూఏఈ తదితర ప్రత్నామ్నాయాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దీనిపై ఈ నెల 20న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Sanju Samson : పాపం సంజూ శాంసన్.. కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనా..?
ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లు జరగనున్నాయి. టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి, టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.