Virat Kohli : లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం సుదీర్ఘ విరామం దొరకడంతో విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడు.
Virat Kohli Spotted In London : శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం సుదీర్ఘ విరామం దొరకడంతో విరాట్ కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడు. అక్కడ సెలవులను తన భార్యా, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ లండన్ వీధుల్లో తిరుగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లండన్‌లోని ఓ రోడ్డును దాటుతున్న సమయంలో ఈ వీడియోను తీసినట్లుగా అర్థమవుతోంది. కేవలం ఐదు సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఆ వీడియోలో కోహ్లీ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. కోహ్లీ కొడుకు అకాయ్ కూడా లండన్‌లోనే జన్మించాడు. రిటైర్‌మైంట్ అనంతరం కోహ్లీ అక్కడే స్థిరపడనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే కేవలం మ్యాచుల సమయంలోనే జట్టుతో కలుసుకున్న కోహ్లీ అనంతరం లండన్‌కు వెళ్లిపోతున్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం సెలబ్రేషన్స్ కోసం ముంబై వచ్చిన కోహ్లీ విజయోత్సవ ర్యాలీ అనంతరం లండన్‌కు విమానం ఎక్కిన సంగతి తెలిసిందే.
కోహ్లీ, అనుష్కలు ఇంగ్లాండ్ పౌరసత్వం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విరుష్క జంటకు లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా వీరిద్దరు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ విఫలం అయ్యాడు. మూడు వన్డేల్లో అతడు వరుసగా 24, 14, 20 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డే టైగా ముగియగా మిగిలిన రెండు వన్డేల్లోనూ భారత్ ఓడిపోయి 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక ఈ మూడు వన్డేల్లో కోహ్లీ స్పిన్నర్లకు వికెట్ సమర్పించుకున్నాడు. అది కూడా ఎల్బీడబ్ల్యూగా మాత్రమే కావడం గమనార్హం.
Sanju Samson : పాపం సంజూ శాంసన్.. కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనా..?
Virat Kohli on the London streets. ?pic.twitter.com/0WvBi9byXZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024