Shakib Al Hasan : షేక్ హసీనా పార్టీతో సంబంధాలు ఉన్నా.. పాక్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు షకీబ్‌ను అనుమతించిన ప్రభుత్వం
ఇటీవల బంగ్లాదేశ్‌లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇటీవల బంగ్లాదేశ్‌లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం మొత్తం రద్దు అయింది. ఇక ఎంపీగా ఉన్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కూడా తన పదవిని కోల్పోయాడు. హసీనా దేశం విడిచివెళ్లిపోవడం, అవామీ లీగ్ పార్టీతో సంబంధాలు ఉండడంతో షకీబ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
అయితే.. హసీనా, అవామీ లీగ్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ పర్యటనలో పర్యటించే బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ అల్ హసన్ చోటు దక్కించుకున్నాడు. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) డైరెక్టర్ ఇఫ్తేకర్ అహ్మద్ స్పందించాడు. పాక్ పర్యటనకు జట్టును ఎంపిక చేసి క్రీడల మంత్రి వద్దకు తీసుకువెళ్లామన్నారు. షకీబ్‌ను జట్టులో చేర్చుకోవడాన్నిఆయన వ్యతిరేకించలేదని, ప్రతిభ ఆధారంగానే జట్టులో చోటు ఇవ్వాలని మాత్రమే సూచించారన్నాడు.
Sanju Samson : పాపం సంజూ శాంసన్.. కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనా..?
తాత్కలిక ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా విద్యార్థి నాయకుల్లో ఒకరైన 26 ఏళ్ల ఆసిఫ్ మహమూద్ ఉన్నారు.
37 ఏళ్ల షకీబ్ బుధవారం లాహోర్‌లోని గడ్డాఫీ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించాడు. హసీనా రాజీనామా చేసినప్పటి నుండి షకీబ్ ఎక్కడా కనిపించలేదు. అతడు కెనడా నుంచి నేరుగా పాకిస్తాన్ చేరుకున్నాడు. కెనడాకు అతడు టీ20 లీగ్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండే షకీబ్ జూలై 14 నుంచి పోస్టులు చేయడం లేదు.
Vinesh Phogat : సీఏఎస్‌లో అప్పీల్ తిరస్కరణ.. వినేష్ ఫోగట్‌కు మరో అవకాశం ఉందా..?
యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బంగ్లాదేశ్ కోర్టులు, సెంట్రల్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి హసీనా విధేయులను తొలగిస్తూ వస్తున్నారు.