Yuzvendra Chahal six wicket haul in County Championship
ఇంగ్లాండ్ గడ్డ పై టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అదరగొడుతున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడుతున్న చహల్ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2లో భాగంగా డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. కాగా.. కౌంటీల్లో చహల్ ఆరు వికెట్ల ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి.
చహల్ ధాటికి డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు విఫలమైనా కూడా మార్టిన్ ఆండర్సన్ సెంచరీతో (105) కదంతొక్కాడు.
కాగా.. ఈ సీజన్‌లో చహల్ 3 మ్యాచ్‌ల్లో 47.30 సగటున 10 వికెట్లు తీశాడు. ఇక చహల్ ఫస్ట్‌క్లాస్ రికార్డు చాలా బాగుంది. 43 మ్యాచ్‌ల్లో 119 వికెట్లు తీశాడు. అయినప్పటికి ఇప్పటి వరకు టెస్టుల్లో అతడు అరంగ్రేటం చేయలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ చహల్‌కు ఇటీవల అవకాశాలు తక్కువ అయ్యాయి. చహల్ భారత్ తరఫున 72 వన్డేల్లో 121 వికెట్లు, 80 టీ20ల్లో 96 వికెట్లు తీశాడు.
కుల్దీప్‌ను ఆడించండి..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ వేదికగా నేటి నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. సాధారణం ఓవల్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లు కూడా పరుగుల పండగ చేసుకోవచ్చు. ఇక ఐదో టెస్టుకు ఉపయోగించనున్న పిచ్ మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరించవచ్చు అని వార్తలు వస్తున్నాయి.
WCL 2025 : డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్.. ఫైనల్‌కు పాక్..
ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో పిచ్ స్పిన్నర్లకు సహకరించవచ్చు అనే అంచనాలు ఉన్న నేపథ్యంలో స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే.. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఉండడంతో అతడికి ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల్లో ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. ఇక చివరి మ్యాచ్‌లోనూ చోటు దక్కడం అనుమానంగానే మారింది.