Tech Tips Telugu : మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ 10 టిప్స్ తప్పక పాటించండి!

Tech Tips Telugu : మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ వెంటనే తగ్గిపోతుందా? అయితే బ్యాటరీ లైఫ్ మెరుగుపర్చుకోవడానికి ఈ 10 టిప్స్ తప్పక పాటించండి.

10 tips to improve your Android smartphone’s battery life

Tech Tips Telugu : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ప్రతిదానికి ఫోన్ ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా అవసరమవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ కమ్యూనికేషన్, వర్క్, ఎంటర్‌టైన్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లు తప్పనిసరి టూల్‌గా మారాయి. ఆండ్రాయిడ్ ఫోన్లను అతిగా వాడటం ద్వారా బ్యాటరీలు దెబ్బతింటాయి. మనకు అవసరమైనప్పుడు ఛార్జర్ కోసం తెగ ఆరాటపడుతుంటాం. అదృష్టవశాత్తూ, మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పొడిగించడానికి రోజంతా వాడేందుకు అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి :
సాధారణంగా, డిస్‌ప్లేలు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజ్‌లో అత్యధిక శక్తిని వినియోగిస్తాయి. వేగంగా బ్యాటరీ తగ్గిపోయేందుకు ప్రధాన కారకంగా పనిచేస్తాయి. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని తగ్గించడం వల్ల మీ ఆండ్రాయిడ్ డివైజ్ బ్యాటరీ లైఫ్ పొడిగించడంలో సాయపడే విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Read Also : 2023 Honda CB350 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా 2023 హోండా CB350 బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

స్క్రీన్ ఆఫ్ చేసే సమయాన్ని తగ్గించండి :
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు స్క్రీన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయ్యే ముందు వ్యవధిని ఎంచుకోవడానికి యూజర్లను అనుమతిస్తాయి. ఈ విరామాన్ని తగ్గించడం వల్ల ఫోన్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు డిస్‌ప్లేను త్వరగా డియాక్టివేట్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచుతుంది. అది బ్యాటరీని ఆదా చేస్తుంది.

ఆటోమాటిక్ బ్రైట్‌నెస్ ఎనేబుల్ చేయొచ్చు :
ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు తరచుగా పర్యావరణ కాంతి సెన్సార్‌ను కలిగి ఉంటాయి. పర్యావరణ పరిస్థితుల ఆధారంగా స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎడ్జెస్ట్ చేస్తాయి. ఈ ఫీచర్ బ్యాటరీ లైఫ్ పెంచడమే కాకుండా కాంతి ప్రభావితపరిసరాలలో స్క్రీన్ ప్రకాశాన్ని ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.

రిఫ్రెష్ రేట్‌ను 60హెచ్‌జెడ్‌కి తగ్గించండి :
సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తాయి. 165హెచ్‌జెడ్ వరకు ఉంటాయి. కానీ, ఈ ఫోన్‌లు రిఫ్రెష్ రేట్‌ను 60హెచ్‌జెడ్‌కి పరిమితం చేసే అవకాశాన్ని కూడా కలిగి ఉంటాయి. అప్పుడు బ్యాటరీ తక్కువ శక్తిని వినియోగిస్తుంది. అలాగే, కొన్ని ఫోన్‌లు (LTPO) టెక్నాలజీతో కూడా వస్తాయి. స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను 1హెచ్‌జెడ్ వరకు తగ్గించగలవు. విద్యుత్ వినియోగాన్ని మరింత తగ్గిస్తుంది. అందుబాటులో ఉన్న ఆప్షన్ ఆధారంగా బ్యాటరీ లైఫ్ సేవ్ చేయడానికి 60హెచ్‌జెడ్ ఆప్షన్ ఎంచుకోండి.

 Android smartphone battery life

వైబ్రేషన్‌ స్టాప్ చేయండి :
రింగ్‌టోన్‌ల కన్నా వైబ్రేషన్‌లు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. వైబ్రేషన్‌లను నిలిపివేయడం అనేది బ్యాటరీ లైఫ్ కాపాడుకోవచ్చు.

యాప్స్‌కు బ్యాటరీ వినియోగాన్ని లిమిట్ చేయండి :
బ్యాక్‌గ్రౌండ్ రన్ అయ్యే యాప్‌లు ముఖ్యమైన సిస్టమ్ సోర్స్ ఉపయోగించుకుంటాయి. బ్యాటరీ వినియోగం పెరగడానికి కారణమవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ సర్వీసులను నిలిపివేయడం ద్వారా అధిక శక్తిని వినియోగించకుండా బ్యాటరీ లైఫ్ మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

పవర్ సేవింగ్ మోడ్‌ని యాక్టివేట్ చేయండి :
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పవర్-సేవింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ సర్వీసులను ఇన్‌యాక్టివ్ చేయడం, స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం కొన్ని సందర్భాల్లో సీపీయూ పర్ఫార్మెన్స్ స్కేల్ చేయడం ద్వారా బ్యాటరీ లైఫ్ పొడిగిస్తాయి.

ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయండి :
మల్టీ యాప్‌లను ఏకకాలంలో రన్ చేయడం వల్ల మీ బ్యాటరీ వేగంగా తగ్గిపోతుంది. పవర్ ఆదా చేయడానికి ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయండి.

ఫైన్-ట్యూన్ సింక్ సెట్టింగ్స్ :
ఇమెయిల్, సోషల్ మీడియా అప్‌డేట్స్ వంటి డేటాను సింకరైజ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీ సింకరైజ్ సెట్టింగ్‌లను తక్కువ తరచుగా సింకరైజ్ చేయడం లేదా వై-ఫైకి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే పవర్ వినియోగాన్ని తగ్గించడానికి ఎడ్జెస్ట్ చేయండి.

బ్లాక్ లేదా డార్క్ కలర్ థీమ్‌ను ఎంచుకోండి :
బ్లాక్ లేదా డార్క్ కలర్ థీమ్ కోసం పిక్సెల్‌లను ఆఫ్ చేయాలి. ఓఎల్ఈడీ స్క్రీన్‌లకు డార్క్ మోడ్ లేదా బ్లాక్ థీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా బ్యాటరీ లైఫ్ ఆదా అవుతుంది.

Read Also : WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్ల కోసం కొత్త బీటా అప్‌డేట్.. ఈజీగా స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు