లైఫ్ ఈజ్ గుడ్ : ఈ టీవీని మడతపెట్టేయ్యొచ్చు

ఫ్లోల్డింగ్ స్మార్ట్ ఫోన్స్ కొంతకాలం హల్ చల్ చేశాయి. కానీ ఇప్పుడు ఫోల్డింగ్ స్మార్ట్ టీవీ కూడా వచ్చేసింది. టెక్నాలజీ అనేది రోజు రోజుకీ కాదు గంట గంటకూ మారిపోతోంది. మరింత స్మార్ట్ గా తయారవుతోంది.

  • Publish Date - January 8, 2019 / 11:28 AM IST

ఫ్లోల్డింగ్ స్మార్ట్ ఫోన్స్ కొంతకాలం హల్ చల్ చేశాయి. కానీ ఇప్పుడు ఫోల్డింగ్ స్మార్ట్ టీవీ కూడా వచ్చేసింది. టెక్నాలజీ అనేది రోజు రోజుకీ కాదు గంట గంటకూ మారిపోతోంది. మరింత స్మార్ట్ గా తయారవుతోంది.

ఫ్లోల్డింగ్ స్మార్ట్ ఫోన్స్ కొంతకాలం హల్ చల్ చేశాయి. కానీ ఇప్పుడు ఫోల్డింగ్ స్మార్ట్ టీవీ కూడా వచ్చేసింది. టెక్నాలజీ అనేది రోజు రోజుకీ కాదు గంట గంటకూ మారిపోతోంది. మరింత స్మార్ట్ గా తయారవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి సంస్థ ఎల్‌జీ 65 అంగుళాల(165 సెంటీమీటర్)  4కే సిగ్నేచర్‌ ఓఎల్‌డీ టీవీని రూపొందించింది. నెవడాలోని లాస్‌వెగాస్‌లో ఈనెల 8వ తేదీ నుంచి జరుగుతున్న కస్టమర్స్ ఎలక్ట్రానిక్‌ ప్రొడక్స్  షోలో వుంచింది. 
ఈ స్మార్ట్ అండ్ ఫోల్డింగ్ టీవీని     మార్కెట్‌లోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది. దీనికి రోల్-అప్ మోడల్‌ కొత్త ఓఎల్‌ఈడీగా చెపుతోంది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనప్పుడు చుట్టచుట్టి లోపల  పెట్టేయవచ్చు.
టీవీ స్పెషల్స్..
65 అంగుళాల తెర..గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్‌ ఎయిర్‌ ప్లే సపోర్టు తోపాటు  100 వాల్ట్స్‌ డాల్బీ అట్మాస్‌ స్పీకర్‌ ఈ టీవీ ప్రత్యేకత అని సీనియర్ డైరెక్టర్  టిమ్ అలెస్సీ తెలిపారు. అంతేకాదండోయ్ ..తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల  8కె ఓఎల్‌ఈడీ టీవీని కూడా కంపెనీ ఆవిష్కరిస్తుండడం విశేషం. దశాబ్దాల క్రితం నుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఈనాటి కంటిముందుకొచ్చిందని ఎల్జీ కంపెనీ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ తెలిపారు. కాకుంటే ఈ టీవీ ధరను  మాత్రం కంపెనీ గోప్యంగా ఉంచడం విశేషం.