2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్‌.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు!

2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్ కలిగి ఉంది. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.

2023 Honda CB300F Launched In India At Rs 1.70 Lakh

2023 Honda CB300F Launch : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) నుంచి OBD-II నిబంధనలకు అనుగుణంగా హోండా CB300F 2023ని లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1,70,000 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కు అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ఈ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇప్పుడు OBD-2 కంప్లైంట్ పవర్‌ప్లాంట్‌తో వస్తుంది. హోండా CB300F 2023లో 293cc, ఆయిల్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, PGM-Fi ఇంజిన్ ఉంది. గరిష్టంగా 24.5PS శక్తిని 25.6Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హోండా CB300F 2023లో USD ఫ్రంట్ ఫోర్క్‌లు, బ్యాక్ వైపున 5-ఫేస్ ఎడ్జెస్ట్ మోనోషాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

ఇందులో డ్యూయల్-ఛానల్ ABS, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను (276mm ఫ్రంట్, 220mm బ్యాక్) పొందుతుంది. హోండా CB300F 2023 టాప్ ఫీచర్లలో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS), ఆల్-LED లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Read Also : Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్ SUV కారు.. 4 వేరియంట్ల ధర ఎంతంటే?

స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, గడియారానికి సంబంధించి 5 లెవల్స్ కస్టమైజడ్ ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్యూటర్ ఉంది. హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్‌లో స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే 3 విభిన్న కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

2023 హోండా CB300F పర్పార్మెన్స్ :
293cc, ఆయిల్-కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్-సిలిండర్ BSVI OBD-II A కంప్లైంట్ PGM-FI ఇంజిన్‌తో 18kW పవర్, 25.6Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. CB300F 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. స్పీడ్ గేర్ షిఫ్ట్‌లను ఎనేబుల్ చేసేందుకు లో ఫోర్స్ అవసరమయ్యే అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌ను పొందుతుంది. డౌన్‌షిఫ్టింగ్ సమయంలో బ్యాక్ వీల్స్ హోపింగ్ నిరోధిస్తుంది.

2023 Honda CB300F Launched In India At Rs 1.70 Lakh

డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు (276mm ఫ్రంట్ & 220mm బ్యాక్) డ్యూయల్-ఛానల్ ABS, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) పర్పార్మెన్స్‌తో సెక్యూరిటీని అనుసంధానించగా, గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్, 5-ఫేస్ ఎడ్జెస్ట్ చేయగల బ్యాక్ మోనో షాక్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

2023 హోండా CB300F ఫీచర్లు :
CB300F అధునాతన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ 5 స్థాయిల కస్టమైజడ్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతరాయం లేని కనెక్టివిటీకి ఆల్-LED లైటింగ్ సిస్టమ్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS)ని కూడా పొందుతుంది.

2023 హోండా CB300F ధర & కలర్లు :
2023 హోండా CB300F OBD-II A డీలక్స్ ప్రో వేరియంట్, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ & మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఉన్నాయి. ఈ కొత్త బైక్ ధర రూ. 1,70,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Read Also : Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 ఈరోజే లాంచ్.. భారత్‌‌లో తయారైన ఈ ఐఫోన్ ధర తక్కువగా ఉంటుందా?

ట్రెండింగ్ వార్తలు