iPhone Users To Android : 26శాతం ఐఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్‌కు మారిపోయారట.. ఎందుకంటే?

ఐఫోన్... లగ్జరీ ఫోన్.. ఆండ్రాయిడ్.. ప్రతి సామాన్యుడు కొనగలిగే ఫోన్.. ఈ రెండింటి మధ్య ఫీచర్ల పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. 2020లో ఆపిల్ యూజర్లు భారీగా తగ్గిపోయారట.. ఎందుకంటే..

iPhone Users To Android : ఐఫోన్… లగ్జరీ ఫోన్.. ఆండ్రాయిడ్.. ప్రతి సామాన్యుడు కొనగలిగే ఫోన్.. ఈ రెండింటి మధ్య ఫీచర్ల పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే యూజర్లు కూడా ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ మంది ఉంటారు. కారణం.. ఆండ్రాయిడ్ తక్కువ ధరకే అందుబాటులో ఉండటం.. అదే ఐఫోన్ అయితే.. ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే.. ఐఫోన్ ఫీచర్లు, యూజర్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది.

ఆండ్రాయిడ్ ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ఏదిఏమైనా.. 2020లో ఆపిల్ యూజర్లు భారీగా తగ్గిపోయారట.. ఎందుకంటే.. 26 శాతం ఆపిల్ యూజర్లు తమ ఐఫోన్‌లను పక్కన పెట్టేసి.. 2020 Q1, Q2 మధ్య ఆండ్రాయిడ్‌కు మారిపోయారని ఆపిల్ సెంట్రల్ రిపోర్టు డేటాలో వెల్లడైంది. ఈ మేరకు ఆపిల్ డేటా రిపోర్టును రిలీజ్ చేసింది. మార్కెట్ పరిశోధన బృందాల నుంచి యాక్సెస్ చేసిన ఈ డేటాను ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదిక వెల్లడించింది.

ఆపిల్-ఎపిక్ ట్రయల్ సమయంలో ఈ డేటా విడుదల అయింది. 2019, 2020లో ఆపిల్ తమ యూజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు మార్కెట్ సర్వే నిర్వహించింది. అందులో డేటా ప్రకారం.. 2019 క్యూ 3- క్యూ 4, 2020 క్యూ 1-క్యూ 2 సమయంలో ఐఫోన్ యూజర్లు 26శాతం మంది ఆండ్రాయిడ్‌కు మారిపోయారని తేలింది. ప్రతి త్రైమాసికంలో వరుసగా 26 శాతం, 12 శాతం మారినట్టు గుర్తించింది.


దీని ఒకే ఒక కారణం ఐఫోన్‌ల ధరలు భారీగా పెరగడమేనట.. అయినప్పటికీ, ఆపిల్ ఐఫోన్ యూజర్ల నుంచి సగటున క్యూ3 2020 నుంచి 88 శాతం రాయల్టీని పొందుతుంది. ఐఫోన్ 12 సిరీస్‌కు క్రెడిట్ ఉంటుంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ 12 మోడళ్లు ఉన్నాయని డేటా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు