×
Ad

Best Affordable Gaming Phones : కొత్త గేమింగ్ ఫోన్ కావాలా? 2025లో 5 బెస్ట్ గేమింగ్ ఫోన్లు మీకోసం.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Best Affordable Gaming Phones : 2025లో మొబైల్ గేమింగ్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో 5 బెస్ట్ సరసమైన గేమింగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.

1/6
Best Affordable Gaming Phones : కొత్త గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? 2025లో మొబైల్ గేమింగ్‌ ట్రెండ్‌గా మారింది. మీరు కూడా గేమర్ అయితే ఇది మీకోసమే.. పెద్దగా ఖర్చు చేయకుండా సరసమైన ధరలోనే అద్భుతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు. 2025లో మీరు కొనుగోలు చేయగల 5 బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏది కొంటారో కొనేసుకోండి.
2/6
ఐక్యూ నియో 10 5G (రూ. 36,999) : ఐక్యూ నియో 10 5G ఫోన్ 1B కలర్ ఆప్షన్లతో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫన్‌టచ్ 15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. యూనిట్ 120W ఛార్జర్‌తో 7000mAh బ్యాటరీ కలిగి ఉంది.
3/6
ఒప్పో K13 టర్బో ప్రో (రూ. 39,999) : ఒప్పో K13 టర్బో 80W ఛార్జర్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఒక బిలియన్ కలర్ ఆప్షన్లను వీక్షించవచ్చు. 1600నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
4/6
రియల్‌మి GT7 (రూ. 36,999) : రియల్‌మి GT 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9400e 4nm చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇంకా, 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉంది. 1 బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.
5/6
వివో T4 అల్ట్రా (రూ. 35,999) : వివో T4 అల్ట్రా ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15, ఫన్‌టచ్15పై రన్ అవుతుంది. 90W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ కలిగి ఉంది.
6/6
షావోమీ 14Civi (రూ. 24,249) : షావోమీ 14 సివి ఫోన్ 6.55-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 68B కలర్ ఆప్షన్లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌గా HyperOS కలిగి ఉంది. ఈ యూనిట్ 67W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.