×
Ad

Best AI Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 60వేల లోపు ధరలో 5 బెస్ట్ AI స్మార్ట్‌ఫోన్లు.. మీకు ఏది బెటర్ అంటే?

Best AI Smartphones : ఏఐ ఫీచర్లతో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో మీకు ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి. 2026లో రూ. 60వేల లోపు ధరలో కొనాల్సిన 5 ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best AI Smartphones

  • రూ. 60వేల లోపు బెస్ట్ ఏఐ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో
  • మిడ్ రేంజ్ ఫోన్లకు భారత మార్కెట్లో ఫుల్ గిరాకీ
  • 6.9-అంగుళాల ఫోల్డబుల్ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే 

Best AI Smartphones : కొత్త ఏఐ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. కెమెరాలతో పాటు బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌ పరంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఏఐ స్మార్ట్‌ఫోన్లతో అదిరిపోయే ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. 2026 ఏడాదిలో రూ. 60వేల లోపు ధరలో ఈ 5 ఏఐ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

మోటోరోలా రేజర్ 50 (రూ. 54,999) :
మోటోరోలా రేజర్ 50 ఫోన్ 1B కలర్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫోల్డబుల్ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 50MP + 13MP రియర్ కెమెరాలు, డ్యూయల్ కెమెరా 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఏఐ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ 4200mAh బ్యాటరీ, 30W ఛార్జర్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ 13s (రూ. 52,999) :
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ యూనిట్ ఆక్సిజన్ OS16పై రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ యూనిట్ డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 1B కలర్ ఆప్షన్లలో 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఏఐ నోట్స్, ఏఐ రిఫ్లెక్షన్ ఎరేజర్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ ట్రాన్స్‌లేషన్ వంటి మల్టీ ఏఐ ఫీచర్లను అందిస్తుంది.

ఐఫోన్ 16e (రూ. 52,390) :
6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ యూనిట్ 48MP ప్రైమరీ, 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8W ఛార్జర్‌తో 4005mAh బ్యాటరీని అందిస్తుంది. ఐఫోన్ 16e ఇంటర్నల్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ అందిస్తుంది. రైటింగ్, రికార్డింగ్, ట్రాన్సులేషన్ వంటి టాస్కులకు బెస్ట్ ఫోన్..

Read Also : Samsung Galaxy S24 FE : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

రియల్‌మి జీటీ 7 ప్రో (రూ. 50,999):
ఏఐ అల్ట్రా క్లియర్, ఏఐ స్కెచ్, ఏఐ నైట్ విజన్ మోడ్, ఏఐ స్మార్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. రియల్‌మి జీటీ 7 ప్రో 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా ఈ యూనిట్ రియల్‌మి యూఐ 6.0 పై రన్ అవుతుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. 1B కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ సెటప్‌ అందిస్తుంది. ఇంకా, 6500mAh బ్యాటరీ, 120W ఛార్జర్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ (రూ. 59,999) :
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ఫోన్ 50MP + 10MP + 12MP బ్యాక్ కెమెరా 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే, జనరేటివ్ ఎడిట్‌లు, లైవ్ ఏఐ ట్రాన్స్‌లేట్ ఏఐ జూమ్‌ కూడా అందిస్తుంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో ఈ యూనిట్ వన్ యూఐ 8.0పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ 4900mAh బ్యాటరీతో 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది.