Best AI Tools
Best AI Tools : మీ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? మీకు ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదా? అయితే, ఇది మీకోసమే.. సరైన ప్రొఫెషనల్ రెజ్యూమ్ జనరేట్ చేయడం చాలా ఈజీ.. మీరు చేయాల్సిందిల్లా ఈ AI టూల్స్ ట్రై చేయడమే.. ఈ ఏఐ టూల్స్ 2025లో మీ రెజ్యూమ్‌ను ఫ్రీగా అద్భుతమైన డిజైన్‌తో జనరేట్ చేసి ఇస్తాయి.
మీరు కోరుకున్న ఉద్యోగానికి తగినట్టుగా (Best AI Tools) మీ స్కిల్స్ అన్నింటిని పూర్తి వివరాలతో సరికొత్త రెజ్యూమ్ రెడీ చేస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఏఐ మార్కెట్లో బాగా పాపులర్ అయిన చాట్ జీపీటీ నుంచి గూగుల్ జెమిని, మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్ కో-పైలట్, గ్రోక్ ఏఐ అనే 5 ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏఐ టూల్ ఉపయోగించి మీకు ఎలాంటి రెజ్యూమ్ కావాలో ఫ్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.. మీరు కూడా ఈ ఏఐ టూల్స్ ఓసారి ట్రై చేయండి.
చాట్ జీపీటీ (ChatGPT) :
ఈ నవంబర్ నుంచి భారత్‌లో ఒక ఏడాది వరకు ఫ్రీ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఓఎన్ఏఐ చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను అందిస్తోంది. చాట్‌జీపీటీ సాయంతో వినియోగదారులు కొన్ని సెకన్లలో స్పెల్లింగ్ తప్పు లేకుండా రెజ్యూమ్‌ను జనరేట్ చేసి ఇస్తుంది. చాట్‌బాక్స్‌లో మీ ప్రాంప్ట్‌లను రాయండి. కొన్ని సెకన్లలోనే మీకు ప్రొఫెషనల్ రెజ్యూమ్ టెక్స్ట్ రెడీ చేసి ఇస్తుంది.
గూగుల్ జెమిని (Google Gemini) :
గూగుల్ జెమిని అద్భుతమైన రెజ్యూమ్‌ను జనరేట్ చేసి ఇస్తుంది. సమ్మరీస్ నుంచి బుల్లెట్ పాయింట్‌ల వరకు అన్ని కవర్ చేస్తుంది. గూగుల్ జెమిని మీ రెజ్యూమ్‌ను ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కచ్చితమైనదిగా ఇతరుల కన్నా బెటర్ ఆప్షన్లతో జనరేట్ చేసి ఇస్తుంది.
వాట్సాప్ ప్లాట్‌ఫారంలో ఇంటిగ్రేట్ మెటా ఏఐ టూల్ మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్ హైలైట్ చేస్తూ క్లియర్ రెజ్యూమ్‌ను జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు.. మీ రెజ్యూమ్ లాంగ్వేజీని కూడా ప్రొఫెషనల్‌గా మార్చేయగలదు. మీ రెజ్యూమ్ టెక్స్ట్‌ను సరైన విధంగా సెట్ చేయగలదు. తద్వారా మీరు కోరుకునే ఉద్యోగాన్ని ఈజీగా దక్కించుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్ కో-పైలట్ (Microsoft Co-pilot) :
మైక్రోసాఫ్ట్ కో-పైలట్ ఏఐ టూల్ మీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెబుతుంది. ఈ ఏఐ టూల్ ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో మీ ATS (అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్) స్కోర్‌ను అప్‌గ్రేడ్ చేసేలా రెజ్యూమ్‌ను జనరేట్ చేయగలదు. మీ బ్యాక్ గ్రౌండ్, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ హైలెట్ చేస్తూ కో-పైలట్ కెరీర్-రెడీ రెజ్యూమ్‌ను జనరేట్ చేయగలదు.
గ్రోక్ ఏఐ (Grok AI) :
ఎక్స్ బ్రాండ్ ఏఐ టూల్ గ్రోక్ ఏఐ (Grok AI) క్లీన్ లాంగ్వేజీతో అద్భుతమైన రెజ్యూమ్‌ను జనరేట్ చేసుకోవచ్చు. మీ స్కిల్స్ హైలైట్ చేస్తుంది. మీకు ప్రొఫెషనల్ సమ్మరీ, క్లీన్ రెజ్యూమ్‌ను జనరేట్ చేసి ఇస్తుంది.