Telugu » Technology » 5 Best Camera Phones You Can Buy On Dhanteras 2025 Check Full Details Sh
5 Best Camera Phones : ధన్‌తేరాస్ పండగ ఆఫర్లు.. ఈ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు మీకోసమే.. ఇలాంటి డీల్స్ మళ్లీ రావు..!
Best Camera Phones : ధన్‌తేరాస్ సందర్భంగా కొత్త గాడ్జెట్‌లను కొనేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకట్టుకునే కెమెరాలతో అనేక కెమెరా స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఓసారి లుక్కేయండి.
Best Camera Phones : ధన్‌తేరాస్ వచ్చేసింది. ఈ పండగ సందర్భంగా అనేక మంది కొత్త వస్తువులు కొంటుంటారు. టెక్ ప్రియులైతే ఏదైనా కొత్త గాడ్జెట్ కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. మీరు కూడా ఈ ఏడాది ధన్‌తేరాస్ సందర్భంగా ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి. హై క్వాలిటీ కెమెరా సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకించి కెమెరా స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తుంటే ఈ ధన్‌తేరాస్‌లో కొనుగోలు చేయగల 5 బెస్ట్ కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నుంచి వన్‌ప్లస్ 13 వరకు మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
2/6
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ పవర్‌ఫుల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ షూటర్, 5x జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది.
3/6
ఐఫోన్ 17 ప్రో : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంది.
4/6
ఐఫోన్ 16 ప్రో : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఈ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్‌ను కలిగి ఉంది.
5/6
గూగుల్ పిక్సెల్ 10 ప్రో : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 5x జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కలిగి ఉంది.
6/6
వన్‌ప్లస్ 13 : వన్‌ప్లస్ 13 ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ సెన్సార్ కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ కూడా ఉంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి.