×
Ad

Best Selfie Camera Phones : సెల్ఫీ ప్రియులకు పండగే.. రూ. 25వేల లోపు ధరలో 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

Best Selfie Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 25వేల లోపు ధరలో 5 బెస్ట్ సెల్ఫీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్? పూర్తి వివరాలివే

  • Published On : February 20, 2026 / 07:16 PM IST

Best Selfie Camera Phones

  • రూ. 25వేల బడ్జెట్ ధరలో బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు
  • టాప్ 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లలో ఏది కొనాలి?
  • ఐక్యూ జెడ్10ఆర్ నుంచి మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ వరకు

Best Selfie Camera Phones : కొత్త సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం రూ. 25వేల బడ్జెట్ లోపు అద్భుతమైన సెల్ఫీలు, అదిరిపోయే కెమెరా క్వాలిటీతో మార్కెట్లో కొత్త ఫోన్లు లభ్యమవుతున్నాయి. మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ ఫోన్లు అసలు వదిలిపెట్టొద్దు. ఈ స్మార్ట్‌ఫోన్లు మీ బడ్జెట్‌ ధరలోనే కొనేసుకోవచ్చు. ఐక్యూ జెడ్10ఆర్ నుంచి మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ వరకు టాప్ 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..

ఐక్యూ Z10R (రూ. 20,998) :
ఐక్యూ Z10Rలో 32MP సెల్ఫీ కెమెరా, డ్యూయల్ 50MP రియర్ కెమెరా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 44W ఛార్జర్‌తో 5700mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

రియల్‌మి P4 పవర్ (రూ. 24,969) :
రియల్‌మి P4 పవర్ 50MP + 8MP డ్యూయల్ కెమెరాతో 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ యూనిట్ రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. ఇంకా, ఈ ఫోన్ 1B రంగులతో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

Read Also : India AI Impact Summit 2026 : ఈ 8ఏళ్ల బాలుడి ముందు టెక్ దిగ్గజాలే సైలెంట్.. AI సమ్మిట్‌లో రణ్‌వీర్ సచ్‌దేవా ప్రతిభకు ప్రపంచం ఫిదా!

ఒప్పో F31 5జీ (రూ. 23,999) :
7000mAh బ్యాటరీతో ఒప్పో F31 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ColorOS 15పై రన్ అవుతుంది. 1B కలర్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ ఒప్పో ఫోన్ 16MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 (రూ. 24,999):
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5లో 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్స్‌తో 6.77-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. 5200mAh బ్యాటరీ, 80W ఛార్జర్‌తో వస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (రూ. 19,999) :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 32MP సెల్ఫీ కెమెరా, డ్యూయల్ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. 1B కలర్లతో 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది.