Best Upcoming Phones
Best Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అతి త్వరలో భారతీయ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. 2025లో ఇప్పటికే అనేక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు టాప్ బ్రాండ్లలో వన్‌ప్లస్ నుంచి ఐక్యూ వరకు 2025లో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 15R (అంచనా ధర : రూ. 45,000) :
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ 15 లాంచ్ (Best Upcoming Phones) తర్వాత వన్‌ప్లస్ 15R లాంచ్‌ను ప్రకటించింది. డిసెంబర్ 17న ప్రారంభం కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. OxygenOS 16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 45వేల కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
వివో X300 ప్రో (అంచనా ధర : రూ. 1,09,999) :
వివో నుంచి వివో X300 ప్రో ఫోన్ డిసెంబర్ 2న లాంచ్ కానుంది. ప్రీమియం ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ కోసం ZEISS టెక్నాలజీతో ఇంజనీరింగ్ అయింది. ఈ వివో X300 ప్రో సర్కిల్ బ్యాక్ కెమెరా సెటప్, డ్యూయల్ 200MP సెన్సార్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో X300 ప్రో ధర సుమారు రూ.1,09,999 ఉంటుందని భావిస్తున్నారు.
ఐక్యూ 15 (అంచనా ధర: రూ. 69,900) :
ఐక్యూ లేటెస్ట్ ఐక్యూ 15ను నవంబర్ 26, 2025న భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు రెడీగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2600 నిట్స్ (HBM) బ్రైట్‌నెస్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో శాంసంగ్ గెలాక్సీ 2K M14 LEAD OLED డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ యూనిట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా పవర్ పొందుతుంది. 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
వివో X300 (అంచనా ధర : రూ. 75,999) :
వివో X300లో 200MP ZEISS మెయిన్ కెమెరా, 50MP ZEISS అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా, 50MP ZEISS APO టెలిఫోటో కెమెరా ఉంటాయి. హై క్వాలిటీ ఫొటోల కోసం V3+ ఇమేజింగ్ చిప్ సపోర్టు ఇస్తుంది. వివో X300 ధర రూ. 75,999గా ఉండే అవకాశం ఉంది.
రియల్‌మి P4x (అంచనా ధర: రూ. 15,000) :
ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్‌లోకి రియల్‌మి P4x ఫోన్ రానుంది. డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో రన్ కానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ మిడ్-రేంజ్, బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15వేల కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.