2026 Big Tech Announcements
Big Tech Announcements : బిగ్ టెక్ ప్రకటనలివే : 2025 సంవత్సరంలో టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్ ప్రపంచాన్నే పూర్తిగా మార్చేసింది. గూగుల్ నానో బనానా నుంచి ఆపిల్ ఎయిర్ వేరియంట్ లాంచ్ వరకు టెక్నాలజీలో అన్ని అద్భుతాలే సృష్టించాయి. ఇప్పుడు, వచ్చే ఏడాది 2026లో కూడా అంతే స్థాయిలో టెక్ రంగంలో మరిన్ని మార్పులు రాబోతున్నాయి. వచ్చే ఏడాది మనం ఆశించే టాప్ 5 పెద్ద టెక్ ప్రకటనలను ఓసారి పరిశీలిద్దాం.
శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ :
2025 ఏడాది ప్రపంచ మార్కెట్లో (Big Tech Announcements) శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ఆవిష్కరించింది. భారత మార్కెట్లోకి రాబోయే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ కావచ్చునని అంచనాలు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఈ ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ ధర రూ. 2లక్షల కన్నా ఎక్కువగా ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 18 రిలీజ్ :
2026లో అతిపెద్ద ప్రకటనలలో ఐఫోన్ 18 ఒకటి కూడా. ఆపిల్ రిలీజ్ సైకిల్ రెండు విడతల్లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ ఫోల్డ్ వంటి హై ఎండ్ ఫోన్ల లాంచ్ ఉండొచ్చు. మార్చి 2027లో ఐఫోన్ 18, ఐఫోన్ 18e ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఆపిల్ ఐఫోన్ ఫోల్డ్ :
ఆపిల్ ఎట్టేకలకు ఫోల్డబుల్ రంగంలో మొదటి అడుగు వేస్తోంది. బహుశా.. వచ్చే ఏడాది ఆపిల్ ఐఫోన్ ఫోల్డ్ లాంచ్ అవ్వొచ్చు. ఈ ఐఫోన్ ఫోల్డబుల్ విషయానికొస్తే.. ఆపిల్ అత్యంత ప్రభావవంతమైన ప్రాజెక్టులలో ఒకటి కానుంది. ఈ మడతబెట్టే ఐఫోన్ ఆపిల్ A20 ప్రో చిప్‌సెట్, హై పర్ఫార్మెన్స్ గల కెమెరా సిస్టమ్‌తో రావచ్చు.
స్లిమ్ ఫోన్లు లేనట్టే.. :
ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేయగా, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఈ రెండు ఫోన్‌లు మార్కెట్లో తమ ఐడెంటిటీని సాధించలేకపోయాయి. ఇప్పుడు, 2026లో ఇదే రెండు కంపెనీలు నెక్ట్స్ సైకిల్‌లో స్లిమ్ ఫోన్‌లను లాంచ్ చేయాలనే ఆలోచనను పక్కనపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో సక్సెస్ అయిన లైనప్‌లపైనే దృష్టి పెడతాయని భావిస్తున్నారు.
AI అడ్వాన్స్‌మెంట్స్ :
ఈ ఏడాదిలో AI రేసులో గూగుల్ జెమిని టాప్ ప్లేసులో నిలించింది. వచ్చే ఏడాదిలో కూడా జెమినితో పోటీగా డొమైన్‌లో గూగుల్‌కు గట్టి పోటీగా OpenAI కొత్త మోడల్‌లు, ఫీచర్లను తీసుకురానుంది. 2026 ఏఐకి ముఖ్యమైన ఏడాదిగా ఉండబోతోంది.