Upcoming Phones : గెట్ రెడీ.. మీ ఫేవరెట్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ రాబోయే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Upcoming Phones : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. రాబోయే 5 అప్ కమింగ్ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

5 Upcoming Phones

  • వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మీ ఫోన్లు రాబోతున్నాయి
  • ఏప్రిల్ 2026లో లాంచ్ కానున్న టాప్ 5 అప్ కమింగ్ ఫోన్లు
  • స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్లు, జీ2 వై-ఫై చిప్‌ ఫీచర్

Upcoming Phones April 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే ఏప్రిల్ నెలలో అదిరిపోయే ఫీచర్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. ఈ మార్చిలో నథింగ్ ఫోన్ 4a, నథింగ్ 4a ప్రో, శాంసంగ్ ఏ సిరీస్, ఐఫోన్ 17ఇ, షావోమీ 17 సిరీస్ అన్నీ ఒకే నెలలో లాంచ్ అయ్యాయి.

ఏప్రిల్ నెలలో కూడా వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి బ్రాండ్‌లు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నాయి. ఇందులో బడ్జెట్ మిడ్-రేంజర్ల నుంచి హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్‌ల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 2026లో లాంచ్ కానున్న 5 స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

వన్‌ప్లస్ నార్డ్ 6 :
వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు లాంచ్ కానుంది. ఈ నార్డ్-సిరీస్ స్పెసిఫికేషన్లు అద్భుతంగా ఉన్నాయి. 165Hz అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 9000mAh బ్యాటరీ ఉంటాయని అంచనా. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ కూడా ఉండొచ్చు. ప్రత్యేకంగా జీ2 వై-ఫై చిప్‌ కూడా వన్‌ప్లస్ అందిస్తోంది. కలర్ ఆప్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.

వివో V70 ఎఫ్ఈ :
ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు వివో V70 FE ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో కెమెరానే స్పెషల్ అట్రాక్షన్. ఈ సెగ్మెంట్‌కు 200MP ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. 120Hz వద్ద 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్‌పై రన్ అవుతుందని అంచనా. బ్యాటరీ సామర్థ్యం 7000mAhగా ఉంటుంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుందని సమాచారం. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఫన్‌టచ్ OS16తో వస్తుందని అంచనా.

Read Also : Credit Card Rules : క్రెడిట్ కార్డు తెగ గీకేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. రూ. 10 లక్షలు దాటితే ఖతమే..!

ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా :
ఒప్పో కచ్చితమైన లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ లిస్టులో ప్రీమియం ఫోన్ ఇదే. 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.82-అంగుళాల క్వాడ్ HD LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌ అందిస్తాయని అంచనా. బ్యాటరీ సామర్థ్యం 6000mAh కన్నా ఎక్కువగా ఉండొచ్చు. 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది.

రియల్‌మి 16 :
రియల్‌మీ 16 5జీ ఫోన్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. 4,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 3,000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.57-అంగుళాల ప్యానెల్‌తో వస్తుంది. క్లియర్ స్క్రీన్‌ను అందిస్తుంది. IP68, IP69 రేటింగ్‌ అందిస్తుంది. ఈ రియల్‌మి 5జీ ఫోన్ 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా.

వివో టీ5 ప్రో :
వివో టీ5 ప్రో అధికారిక లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. నివేదిక ప్రకారం.. ఏప్రిల్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 30వేల కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. వివో టీ4 ప్రో ప్రారంభ ధరతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు.