Credit Card Rules : క్రెడిట్ కార్డు తెగ గీకేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. రూ. 10 లక్షలు దాటితే ఖతమే..!
New Credit Card Rules : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త క్రెడిట్ కార్డు నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డులతో చేసే హై వాల్యూ పేమెంట్లపై ఐటీ కన్నేసి ఉంటుంది జాగ్రత్త.. పాన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
New Credit Card Rules ( Image Credit : Gemini AI )
- ఏప్రిల్ 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్
- క్రెడిట్ కార్డుతో పాన్ కార్డు లింక్ తప్పనిసరి
- రూ. 10 లక్షలకు మించితే ఐటీ నోటీసులు రావొచ్చు
New Credit Card Rules : క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. క్రెడిట్ కార్డ్ నిబంధనలు కూడా ఫస్ట్ నుంచే మారనున్నాయి. చేతిలో కార్డు ఉంది కదా తెగ గీకేస్తున్నారా? జర జాగ్రత్త.. మీ ప్రతి లావాదేవీపై ఐటీ నిఘా పెడుతుందని గుర్తుంచుకోండి.
దేశంలో 11 కోట్లకు పైగా యాక్టివ్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఉన్నారు. ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన లావాదేవీలు జరుగుతాయి. ఆదాయపు పన్ను చట్టం, 2025, ముసాయిదా ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ మీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను నిశితంగా పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఏ మార్పులు రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏప్రిల్ 1 నుంచి మీ క్రెడిట్ కార్డ్ కేవలం పేమెంట్ కోసం మాత్రమే ఉండదు. మీ టాక్స్ ప్రొఫైల్‌కు లింక్ అయిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ కూడా. మీ ఆదాయం, ఖర్చులు, పన్ను ఫైలింగ్‌ల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకపోతే మీరు కొత్త నిబంధనలపై ఆందోళన అవసరం లేదు. అయితే, మీ ఖర్చులు ఎక్కువగా ఉండి మీరు నివేదించే ఆదాయం తక్కువగా ఉంటే మాత్రం మీరు పన్ను శాఖ నిఘాలోకి వెళ్తారు జాగ్రత్త.
హై వాల్యూ లావాదేవీలపై రిపోర్టు :
క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి అతిపెద్ద మార్పు రాబోతుంది. ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఒక క్రెడిట్ కార్డు యూజర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చేస్తే మీ బ్యాంకు ఈ సమాచారాన్ని ఆదాయపు పన్ను విభాగానికి రిపోర్టు చేయొచ్చు.
Read Also : Best Window AC : బాబోయ్ ఏప్రిల్ అంతా ఎండలే.. రూ. 40వేల లోపు బెస్ట్ విండోస్ ఏసీలు.. ఏది కొంటారంటే?
నిర్దేశిత పరిమితిని మించి విదేశీ ఖర్చులను కూడా మానిటరింగ్ జరుగుతుంది. రూ . లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ పేమెంట్లపై కూడా నిశితంగా పరిశీలన ఉంటుంది. మీ ఐటీఆర్‌లో చూపిన ఆదాయాన్ని మీ ఖర్చులు మించిపోతే మీకు నోటీసు అందవచ్చు.
ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు కీలక మార్పులు :
ప్రస్తుతం దేశంలో 11 కోట్లకు పైగా యాక్టివ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇకపై ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీలను నిశితంగా గమనిస్తుంది. బ్యాంకులు రూ. 10 లక్షలకు మించిన ఖర్చులను రిపోర్టు ఆదాయపన్ను శాఖకు రిపోర్టు చేయొచ్చు.
పాన్-క్రెడిట్ కార్డ్ లింకింగ్ :
ముసాయిదా నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డులకు పాన్ (PAN)ను లింక్ చేయడం తప్పనిసరి. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత, బ్యాంకులు పాన్ (PAN) లేకుండా క్రెడిట్ కార్డులు జారీ చేయరు. మీ ప్రస్తుత క్రెడిట్ కార్డును మీ పాన్ (PAN)కు లింక్ చేసి ఉండాలి. మీ క్రెడిట్ కార్డు మీ పన్ను ఐడెంటిటీగా పనిచేస్తుంది. మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ 3 నెలల కన్నా పాతది కాకపోతే పాన్ (PAN) కోసం అప్లయ్ చేస్తే అదే అడ్రస్ ప్రూఫ్ గా ఇవ్వొచ్చు.
