5G Phones Launch : ఈ నెలాఖరులో లాంచ్ అయ్యే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

5G Phones Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 చివరిలో కొన్ని స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. వన్‌ప్లస్, రెడ్‌మి, ఐక్యూ వంటి 5జీ ఫోన్‌లు లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

5G phones set to launch in December 2023

5G Phones Launch : 2023 చివరి నెల డిసెంబర్‌లో రాబోయే స్మార్ట్‌ఫోన్లకు లాంచ్‌కు సంబంధించి వివరాలు రివీల్ అయ్యాయి. వన్‌ప్లస్ 12, రెడ్‌మి 13సీ, ఐక్యూ 12 వంటి 5జీ ఫోన్‌లు రాబోయే రోజుల్లో లేదా వారాల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫోన్లు వేర్వేరు ధరల్లో ఉండనున్నాయి. మీరు ఈ 5జీ ఫోన్‌లను కొనుగోలుకు చూస్తుంటే మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

డిసెంబర్ 2023లో లాంచ్ కానున్న 5జీ ఫోన్‌లు ఇవే :
వన్‌ప్లస్ 12 డిసెంబర్ 5న లాంచ్ :
డిసెంబర్ 5న చైనాలో వన్‌ప్లస్ 12 లాంచ్ కానుంది. గ్లోబల్ లాంచ్ జనవరిలో జరుగుతుందని అధికారిక వెబ్‌సైట్ సూచించింది. రాబోయే 5G ఫోన్ గురించి అన్ని వివరాలు ఇప్పటికే రివీల్ అయ్యాయి. వన్‌ప్లస్ 12 ఫ్లాగ్‌షిప్ క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను అందిస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ డివైజ్ 4,700నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 2కె డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గత వెర్షన్‌లో లేని వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

OnePlus 12 5G phones  

Read Also : WhatsApp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను పంపుకోవచ్చు!

వన్‌ప్లస్ 12లోని ఫీచర్ వర్షపు పరిస్థితుల్లో కూడా అద్భుతంగా పనిచేయగలదు. ​​కంపెనీ అంతర్గత ‘రెయిన్‌వాటర్ టచ్’ టెక్నాలజీనే దీనికి కారణంగా చెప్పవచ్చు. వన్‌ప్లస్ ఓపెన్ మాదిరిగానే కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ మరో సెన్సార్‌తో పాటు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 48ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 64ఎంపీ టెలిఫోటో కెమెరాను అందిస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ది బాక్స్‌తో రానుంది.

డిసెంబర్ 6నే రెడ్‌మి 13సి లాంచ్ :
రెడ్‌మి 13సి 5జీ ఫోన్ కూడా డిసెంబర్ 6న లాంచ్ కావాల్సి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో రానుంది. అదే చిప్‌సెట్ రియల్‌మి 11ఎక్స్ రియల్‌మి11 5కి కూడా పవర్ అందిస్తుంది. రెడ్‌మి 13సీ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని టీజర్‌లు ధృవీకరించాయి.

Redmi 13C 5G Phones

ఈ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించి ర్యామ్‌ను 16జీబీ వరకు పొడిగించే ఆప్షన్ కూడా కలిగి ఉండనుంది. ముందు భాగంలో టియర్‌డ్రాప్ నాచ్, స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్ కోటింగ్ ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ కూడా ఉన్నాయి. అధికారిక టీజర్‌ల ప్రకారం.. రెడ్‌మి18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. మిగిలిన వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు. రాబోయే రెడ్‌మి ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉండవచ్చని అంచనా.

ఐక్యూ 12 డిసెంబర్ 12న లాంచ్ :
ఇటీవలే చైనాలో ఐక్యూ 12 లాంచ్ అయింది. డిసెంబర్ 12న భారత మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ముందే రివీల్ అయ్యాయి. 1.5కె రిజల్యూషన్‌తో భారీ 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను అందిస్తుంది. ఈ ప్యానెల్ 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో హీంటింగ్ కోసం పెద్ద స్టీమ్ రూం కలిగి ఉంది.

iqoo 12 5G Phones

హుడ్ కింద, ఐక్యూ 12 మోడల్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును కూడా అందించింది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. 50ఎంపీ వైడ్-యాంగిల్ సెన్సార్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100ఎక్స్ డిజిటల్ జూమ్‌కు సపోర్టుతో 64ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరాను చూడవచ్చు.

Read Also : New Kia Sonet facelift : డిసెంబర్ 14న కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు