×
Ad

Best Camera Phones : ఈ కెమెరా ఫోన్లకు ఫుల్ క్రేజ్.. రూ. 15వేల లోపు ధరలో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

Best Camera Phones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ జనవరిలో రూ. 15వేల లోపు ధరలో 6 బెస్ట్ కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో ఏ కెమెరా ఫోన్ కొంటారో కొనేసుకోండి.

Best Camera Phones (Image Credit To Original Source)

  • రూ. 15వేల కన్నా తక్కువ ధరలో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు
  • ​రియల్‌మి P4x డ్యూయల్ 50MP కెమెరాల యూనిట్
  • ​శాంసంగ్ గెలాక్సీ F17లో 13MP సెల్ఫీ కెమెరా ఆప్షన్
  • పోకో C85లో డ్యూయల్ 50MP కెమెరా ఆప్షన్

Best Camera Phones : కొత్త కెమెరా ఫోన్ కావాలా? భారత మార్కెట్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అనేక స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. రూ. 15వేల కన్నా తక్కువ ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. అదిరిపోయే డిస్‌ప్లేలు, ఆకట్టుకునేలా కెమెరా పర్ఫార్మెన్స్‌ అందిస్తాయి.

హై రిజల్యూషన్ సెన్సార్లు ఉండటం వల్ల ఈ ఫోన్లకు ఫుల్ క్రేజ్ పెరిగింది. మార్కెట్లో వినియోగదారులు ఈ ఫోన్లనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఈ 6 అద్భుతమైన కెమెరా ఫోన్లలో ధర, కెమెరా క్వాలిటీ పరంగా మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

​రియల్‌మి P4x (రూ. 14,999) :
రియల్‌మి P4x ఫోన్ 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ 1000 నిట్స్ (HBM)తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. ఈ యూనిట్ డ్యూయల్ 50MP కెమెరాలతో వస్తుంది.

​శాంసంగ్ గెలాక్సీ F17 (రూ. 13,900):
శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ (HBM)తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఎక్సినోస్ 1330 ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 5MP + 2MP రియర్ కెమెరా 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Google Pixel 10 Pro XL : అమెజాన్‌లో ఖతర్నాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL భారీగా తగ్గిందోచ్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా? 

ఐక్యూ Z10x (రూ. 14,999) :
డ్యూయల్ 50MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1050 నిట్స్ (HBM)తో 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ యూనిట్ ఫన్‌టచ్ 15పై రన్ అయ్యే మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 6500mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.

Best Camera Phones (Image Credit To Original Source)

రెడ్‌మి 15C (రూ. 13,999) :
రెడ్‌మి 15C 50MP రియర్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ యూనిట్ మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ద్వారా పవర్ పొందుతుంది హైపర్OS 2పై రన్ అవుతుంది. 6000mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

పోకో C85 (రూ. 11,999) :

షావోమీ పోకో C85లో డ్యూయల్ 50MP కెమెరా ఉంది. 6.9-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ద్వారా ఈ యూనిట్ 33W ఛార్జర్‌తో 6000mAh బ్యాటరీని అందిస్తుంది.

వివో T4 లైట్ (రూ. 11,999) :
వివో T4 లైట్ ఫోన్ 6.74-అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ కూడా ఉంది. కెమెరా విషయానికొస్తే.. డ్యూయల్ 50MP ఆక్సిలరీ లెన్స్ , 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ యూనిట్ ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. 15W ఛార్జర్‌తో 6000mAh బ్యాటరీని అందిస్తుంది.