Best Samsung Phones
Best Samsung Phones : శాంసంగ్ ఫ్యాన్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. మీ బడ్జెట్ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు, ధర, బ్యాటరీ బ్యాకప్ వంటి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు.
మీరు కూడా రూ. 35వేల లోపు ధరలో శాంసంగ్ ఫోన్ (Best Samsung Phones) కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. 2025లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట శాంసంగ్ ఫోన్లపై ఓసారి లుక్కేయండి. ఇందులో ఏ శాంసంగ్ కొంటారో కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S24 FE (రూ. 31,999) :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో పాటు 50MP + 8MP + 12MP సెన్సార్‌లతో ట్రిపుల్-కెమెరా సెటప్‌అందిస్తుంది. ఎక్సినోస్ 2400e చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ ఫోన్ రోజువారీ టాస్కులకు బెస్ట్. 4700mAh బ్యాటరీతో ఫుల్ బ్యాకప్‌ను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A36 (రూ. 26,796) :
ఈ శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. సరసమైన ధర వద్ద క్లీన్ శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్.
శాంసంగ్ గెలాక్సీ A55 (రూ. 24,980) :
శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A55 50MP కెమెరా సిస్టమ్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్ కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి స్టేబుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S23 FE (రూ. 34,999) :
శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ డిజైన్ అదిరిపోయే ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. 50MP ట్రిపుల్-కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. లేటెస్ట్ S-సిరీస్ ఫోన్ కాకుండా ప్రీమియం ఫీచర్లను కోరుకునే యూజర్లకు సరైన ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ F55 (రూ. 18,400) :
శాంసంగ్ గెలాక్సీ F55 ఫోన్ 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్+ డిస్‌ప్లే, 50MP + 8MP + 2MP సెన్సార్‌లతో ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రోజువారీ పనులకు గేమింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ బడ్జెట్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M56 (రూ. 20,955) :
శాంసంగ్ అభిమానులకు శాంసంగ్ గెలాక్సీ M56 అద్భుతమైన ఆప్షన్. భారీ వినియోగం కోసం 6000mAh లాంగ్ లైఫ్ బ్యాటరీతో వస్తుంది. 50MP కెమెరా సెటప్ అదిరిపోయే ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. ధర పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.