×
Ad

Best Smartphones : కంటెంట్ క్రియేటర్ల కోసం రూ. 30వేల లోపు 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు భయ్యా..!

Best Smartphones : కంటెంట్ క్రియేటర్లు, వీలాగ్స్ కోసం రూ. 30వేల లోపు అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో ఏది కొంటారో కొనేసుకోండి.

6 Best Smartphones

Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? హై-క్వాలిటీ కంటెంట్‌ క్రియేటర్లకు అద్భుతమైన ఫోన్లు.. మీరు రూ. 30వేల లోపు బడ్జెట్ పెట్టుకుంటే చాలు.. ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు వ్లాగర్‌లు, కంటెంట్ క్రియేట్ చేసేందుకు దేనికైనా ఈ ఫోన్లను వాడేసుకోవచ్చు.

ఐక్యూ నియో 10ఆర్, ఒప్పో రెనో 13, మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 5G, రియల్‌మి P4 ప్రో, వివో T4 ప్రో వంటి మరెన్నో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ వంటి ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. రూ. 30వేల లోపు ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.. మరిన్నింటిని అందిస్తున్నాయి.

ఐక్యూ నియో 10R (రూ. 24,998) :
6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో ఐక్యూ నియో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ 50MP+8MP డ్యూయల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పవర్‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ద్వారా ఆధారితంగా 6400mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ కంటెంట్ క్రియేటర్లకు అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఒప్పో రెనో 13 (రూ. 23,999) :
​రెనో సిరీస్‌ లైనప్‌లో ఒప్పో రెనో 13 ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, అదిరిపోయే వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP+8MP బ్యాక్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. వీడియోలను రికార్డింగ్ ఇష్టపడే కంటెంట్ క్రియేటర్లకు అద్భుతమైన ఫోన్ అని చెప్పొచ్చు.

Read Also : PAN Aadhaar Link : బిగ్ అలర్ట్.. అర్జెంట్‌గా మీ పాన్-ఆధార్ లింక్ చేయండి.. లేదంటే PAN ఇక పనిచేయదు.. లింకింగ్ ప్రాసెస్ వెరీ ఈజీ..!

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (రూ. 20,700) :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 50MP+13MP డ్యూయల్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన విజువల్స్‌ అందిస్తుంది. డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 5500mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వ్లాగర్‌లకు బెస్ట్ ఆప్షన్‌.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 5G (రూ. 22,999) :

50MP+8MP డ్యూయల్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 5G వీడియోలను రికార్డింగ్ ఇష్టపడే వారికి అద్భుతమైన ఫోన్. 6.77-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో డైమెన్సిటీ 8350 అపెక్స్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ 7100mAh బ్యాటరీతో వస్తుంది.

రియల్‌మి P4 ప్రో (రూ. 24,999) :
రియల్‌మి P4 ప్రో ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రోజువారీ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ అవుతుంది. 50MP+ 8MP బ్యాక్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. విభిన్న లైటింగ్‌లో షాట్‌లను క్లిక్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. మొత్తంమీద, కంటెంట్ క్రియేటర్లు వంటి మల్టీ టాస్క్ చేసే యూజర్లకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

వివో T4 ప్రో (రూ. 22,999) :
​వివో T4 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వివో T4 ప్రో అద్భుతమైన విజువల్స్, సున్నితమైన స్క్రోలింగ్‌ అందిస్తుంది. ఈ యూనిట్ ఫ్రంట్ సైడ్ 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ద్వారా పవర్ పొంది 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ కెమెరా సామర్థ్యాలతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు అద్భుతంగా ఉంటుంది.