Best Vivo Phones : వివో లవర్స్ మీకోసమే.. రూ. 35వేల లోపు 6 బెస్ట్ వివో ఫోన్లు ఇవే.. నాల్గో ఫోన్ మాత్రం కొనాల్సిందే..!
Best Vivo Phones : వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ మార్చి 2026లో రూ. 35వేల లోపు ధరలో 6 అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫోన్ కొంటే బెటర్?
- మార్చి 2026లో రూ. 35వేల లోపు ధరలో 6 బెస్ట్ వివో ఫోన్లు
- కెమెరా ఫోన్ల కోసం చూసేవారు ఈ వివో ఫోన్లు కొనేసుకోవచ్చు
- వివో టీ4 అల్ట్రా నుంచి వివో V30 5జీ వరకు కిర్రాక్ ఫోన్లు
Best Vivo Phones : వివో లవర్స్ కోసం అద్భుతమైన వివో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు అభిమాని అయితే ఈ ఫోన్లలో ఏదో ఒకటి కొనేసుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏ బ్రాండ్ ఫోన్ కొంటే బెటర్ అనేది చెప్పడం కష్టమే. కానీ, మీ ఫేవరెంట్ ఫోన్ ఉంటే కొనేసుకోవచ్చు.
2026లో మీకోసం మార్కెట్లో కొన్ని వివో స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వివో కంపెనీకి చెందిన ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫోటో ప్రియులు, గేమర్లు, రోజూ ట్రావెల్ చేసే వారికి ఈ వివో ఫోన్లు బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 6 వివో ఫోన్లలో ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.
వివో T4 అల్ట్రా (రూ. 34,999) :
వివో T4 అల్ట్రాలో OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో ట్రిపుల్ 50MP + 50MP + 8MP రియర్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది.
వివో V60e 5G (రూ. 33,999) :
వివో V60e 5జీ ఫోన్ ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో ఈ యూనిట్ ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. 6500mAh బ్యాటరీ, 90W ఛార్జర్ కూడా ఉన్నాయి.
వివో T4 ప్రో 5G (రూ. 32,999) :
స్నాప్‌డ్రాగన్ 7వ జనరేషన్ 4 ప్రాసెసర్‌తో ఈ యూనిట్ ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. 6500mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాదు.. ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ట్రిపుల్ 50MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
వివో V30e 5G (రూ. 27,340) :
వివో V30e 5జీలో 50MP + 8MP డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ యూనిట్ ఫన్‌టచ్ 14పై రన్ అవుతుంది. విజువల్స్ పరంగా ఈ యూనిట్లో ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది.
వివో Y400 ప్రో 5G (రూ. 27,999) :
వివో Y400 ప్రో 5Gలో డ్యూయల్ 50MP అసిస్టెలెన్స్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ యూనిట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఫన్‌టచ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. 5500mAh బ్యాటరీ, 90W ఛార్జర్ ఉన్నాయి.
వివో V30 5G (రూ. 27,999) :
వివో వి30 5జీలో ట్రిపుల్ 50MP + 50MP + 2MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫన్‌టచ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అదనంగా, ఒక బిలియన్ కలర్ ఆప్షన్లు, 2800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ వివో ఫోన్లో 5000mAh బ్యాటరీ, 80W ఛార్జర్ ఉన్నాయి.
