6 Best Vivo Phones
6 Best Vivo Phones : వివో లవర్స్ ఇది మీకోసమే.. కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోపే స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? జూన్ 2025లో వివో కొన్ని బెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్లను అందిస్తోంది.
స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, కెమెరా-సెంట్రలైజడ్ ఫీచర్లతో వివో లైనప్ రూ. 35వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. మీరు గేమింగ్, వ్లాగింగ్, రోజువారీ మల్టీ టాస్కింగ్ కోసం టాప్ 6 వివో ఫోన్లలో ఏదో ఒకటి ఎంచుకుని కొనేసుకోవచ్చు.
వివో V50 (రూ. 33,330) :
వివో V50 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల HDR10+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరా సెటప్, 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. హై క్వాలిటీ ఫొటో, వీడియో కంటెంట్‌కు బెస్ట్ ఫోన్. రోజంతా ఛార్జింగ్ అందించే భారీ 6000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
వివో V50e (రూ. 26,999) :
వివో V50e ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోటోల వారీగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా, 5600mAh బ్యాటరీ 90W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
వివో V40 (రూ. 34,999) :
వివో V40 ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. బేసిక్, టెలిఫోటో, ఫ్రంట్ షాట్‌ల కోసం ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. యాంగిల్ ఏదైనా అద్భుతమైన ఇమేజింగ్‌ను అందిస్తుంది. 5500mAh బ్యాటరీతో లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
వివో T3 అల్ట్రా (రూ. 26,999) :
వివో T3 అల్ట్రా ఫోన్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, 6.78-అంగుళాల 120Hz డిస్‌ప్లే కలిగి ఉంది. 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 4K వీడియో సపోర్ట్, 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5500mAh బ్యాటరీతో పవర్ అందిస్తాయి.
వివో T4 ఫోన్ (రూ. 21,999) :
వివో T4 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా, భారీ 7300mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
వివో T3 ప్రో (రూ. 20,735) :
వివో T3 ప్రో ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌పై రన్ అవుతుంది. 4K వీడియో క్వాలిటీతో 50MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ రీఛార్జింగ్‌తో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.