iPhone 16 Pro : ఇది కదా ఆఫర్ అంటే.. ఐఫోన్ 16 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..!
iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఆఫర్ అదుర్స్.. ఏకంగా రూ. 14వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

iPhone 16 Pro
iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గింది. మీరు కూడా కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ (iPhone 16 Pro) అసలు వదిలిపెట్టొద్దు. ఆపిల్ అత్యంత అడ్వాన్స్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తగ్గిన ధరకు అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ ధరను రూ. 14వేల కన్నా తక్కువ ధరకే డీల్ అందిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రోపై అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్ అని చెప్పొచ్చు.
Read Also : Google Pixel 9 Price : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. అతి చౌకైన ధరకే గూగుల్ పిక్సెల్ 9 ఫోన్.. ఇలా కొన్నారంటే?
ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ :
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) రూ.1,19,900కి లాంచ్ కాగా ఇప్పుడు రూ.1,09,500కి లిస్ట్ అయింది. HDFC బ్యాంక్‌తో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.4,500 తగ్గింపు పొందవచ్చు. ఫైనల్ ధర రూ.1,05,000కి తగ్గుతుంది.
అదనంగా, కస్టమర్లు 821 లాయల్టీ పాయింట్లను (రూ. 821 వాల్యూ) కూడా అందుకుంటారు. భవిష్యత్తులో కొనుగోళ్లకు రీడీమ్ చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్‌ను బట్టి ధరను మరింత తగ్గించవచ్చు.
ఐఫోన్ 16 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) 6.3-అంగుళాల OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌తో వస్తుంది. గేమింగ్ చేస్తున్నా, స్ట్రీమింగ్ చేస్తున్నా లేదా బ్రౌజ్ చేస్తున్నా అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
స్పీడ్ పర్ఫార్మెన్స్, హార్డ్‌వేర్ ఆధారిత రే ట్రేసింగ్‌తో నెక్స్ట్ జనరేషన్ గేమింగ్‌ను అందిస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ ఫోన్ 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో సెన్సార్‌తో ప్రొఫెషనల్-గ్రేడ్ ఫోటోగ్రఫీని అందిస్తుంది. 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
Read Also : UPI New Rule : బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్.. ఇకపై రూ.3 వేలు దాటితే ఛార్జీల బాదుడే..!
ఐఫోన్ ఎందుకు కొనాలి? :
ఈ ఏడాదిలో ప్రీమియం ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. విజయ్ సేల్స్‌లో ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. ఫ్లాగ్‌షిప్ స్పెషిఫికేషన్లు, మొత్తం రూ. 14,900 కన్నా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు. తద్వారా ఐఫోన్ 16 ప్రో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.