UPI New Rule : బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్.. ఇకపై రూ.3 వేలు దాటితే ఛార్జీల బాదుడే..!
UPI New Rule : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే.. త్వరలో కొత్త రూల్ వస్తోంది.. యూపీఐ పేమెంట్లు రూ. 3వేలు దాటితే ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.

UPI New Rule
UPI New Rule : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత రోజుల్లో యూపీఐ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏది కొనాలన్నా సరే ఎక్కువగా యూపీఐ పేమెంట్లలోనే (UPI New Rule) లావాదేవీలు చేస్తున్నారు. యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో వినియోగదారులు యూపీఐపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
అతి త్వరలో యూపీఐ పేమెంట్లపై కూడా ఛార్జీలు విధించనున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో కొత్త రూల్ తీసుకురానున్నట్టు సమాచారం. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఇకపై యూపీఐ లావాదేవీల్లో రూ.3వేలు కన్నా ఎక్కువగా ఉంటే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించనున్నారు. అంటే.. అంతకన్నా తక్కువ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ పడదు అనమాట.
డిజిటల్ పేమెంట్ల నిర్వహణ ఖర్చులు పెరగడంతో పేమెంట్ సర్వీసు సంస్థలు, బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది. మర్చంట్స్ వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా పేమెంట్ వాల్యూ ఆధారంగా MDR విధించే అవకాశం కనిపిస్తోంది.
ఇదే జరిగితే.. యూపీఐ పేమెంట్లలో రూ.3వేలు దాటితే ఛార్జీలు విధించవచ్చు. 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీని ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది. నివేదికల ప్రకారం.. రిటైల్ డిజిటల్ లావాదేవీలలో యూపీఐ ఇప్పుడు 80 శాతం వాటాను కలిగి ఉంది.
పెద్ద లావాదేవీల సంఖ్య పెరగడం, ముఖ్యంగా మర్చంట్ పేమెంట్స్, బ్యాంకుల నిర్వహణ ఖర్చును పెంచాయి. జీరో MDR విధానంతో పెట్టుబడికి ఎలాంటి ప్రోత్సాహకం లభించడం లేదు. 2020 ఏడాది తర్వాత యూపీఐలో మర్చంట్ పేమెంట్స్ మొత్తం లావాదేవీ రూ. 60 లక్షల కోట్లకు చేరుకుంది.
యూపీఐ కొత్త రూల్ :
యూపీఐ (UPI New Rule) మర్చంట్స్ (టర్నోవర్ ఎక్కువగా ఉన్న) నుంచి 0.3శాతం MDR వసూలు చేయాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) సూచించింది. ప్రస్తుతం క్రెడిట్/డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 శాతం నుంచి 2శాతం వరకు ఉంది. ఇందులో RuPay కార్డులను చేర్చలేదు.
ప్రస్తుతానికి, రూపే క్రెడిట్ కార్డులకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంది. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, NPCIతో సంప్రదించిన తర్వాత రాబోయే 12 నెలల్లో తీసుకోనున్నాయి. యూపీఐని ప్రోత్సహించడమే కాకుండా, డిజిటల్ పేమెంట్ల ఎకోసిస్టమ్ మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.
Read Also : Vivo T4 Ultra : వివోనా మజాకా.. కొత్త వివో T4 అల్ట్రా ఫోన్ ఆగయా.. రివర్స్ ఛార్జింగ్ హైలెట్ భయ్యా.. ధర ఎంతంటే?
యూపీఐ యూజర్లపై ప్రభావం :
యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీలు విధించడం ద్వారా వినియోగదారులపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. యూపీఐ లావాదేవీలపై యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు విధించకపోవచ్చు. గతంలో యూపీఐ ఆధారిత పేమెంట్లపై మర్చంట్స్ ఒక శాతం లోపు ఛార్జీలను బ్యాంకులకు చెల్లించేవారు. అయితే, ఈ ఎండీఆర్ ఛార్జీలను 2022లో కేంద్రం ఎత్తివేసింది.