Affordable Android Phones : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. వీడియో క్వాలిటీ కేక.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Affordable Android Phones : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను స్టైల్, హై క్లారిటీతో వీడియో షూట్ చేసేందుకు అద్భుతమైన 5 సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్లు మీ బడ్జెట్‌ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.

Affordable Android Phones : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. వీడియో క్వాలిటీ కేక.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

Affordable Android Phones

Updated On : June 11, 2025 / 4:27 PM IST

Affordable Android Phones : కంటెంట్ క్రియేటర్లకు పండగే.. సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ పోస్టు చేస్తుంటారా? అందులోనూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేవారు అయితే, ఇది మీకోసమే.. ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ కోసం ఖరీదైన హై-ఎండ్ ఫోన్ అవసరం లేదు. అనేక బడ్జెట్-ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఆసక్తిగల వినియోగదారులు ఆకర్షణీయమైన కెమెరాలు, వీడియో క్వాలిటీని అందించే ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. పెద్దగా ఖర్చు చేయొద్దని భావిస్తే కంటెంట్ క్రియేటర్లకు ఇలాంటి ఫోన్లు సరైనవిగా చెప్పొచ్చు. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా యూట్యూబ్ ట్రావెలర్ లేదా వీలాగ్స్ చేస్తుండేవారు అయితే ఈ 5 సరసమైన ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : UPI New Rule : బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్.. ఇకపై రూ.3 వేలు దాటితే ఛార్జీల బాదుడే..!

వివో V50 (రూ. 33,460) :
వివో V50 ఫోన్ 6.77-అంగుళాల HDR10+ డిస్‌ప్లే కలిగి ఉంది. అల్ట్రా-స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫ్లూయిడ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ కలిగి ఉంది. ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరా సిస్టమ్, 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. హై క్వాలిటీ వీడియోలకు అద్భుతమైన ఫోన్. భారీ 6000mAh బ్యాటరీ రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది.

షావోమీ 14 Civi (రూ. 30,998) :
షావోమీ 14 Civi ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫొటో పరంగా డ్యూయల్ 50MP బ్యాక్ లెన్స్, 32MP సెల్ఫీ, అల్ట్రావైడ్ సెన్సార్‌లతో పాటు కంటెంట్ క్రియేటర్లకు సరైనది. 4700mAh బ్యాటరీతో ఎక్స్‌‍టెండ్ యూసేజ్‌కు సపోర్టు ఇస్తుంది.

రియల్‌మి GT 7T (రూ. 34,999) :
రియల్‌మి GT 7T ఫోన్ 6.8-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. రియల్‌మి GT 7T ఫోన్ హై పర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ డైమన్షిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. క్రిస్టల్-క్లియర్ వీడియో కంటెంట్ కోసం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్టాండ్అవుట్ 7000mAh బ్యాటరీ డౌన్‌టైమ్ కోసం 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A36 (రూ. 30,999) :
శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను అందిస్తుంది. కెమెరా రేంజ్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మల్టీఫేస్ వీడియో షూటింగ్‌కు సరైనది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండేలా చేస్తుంది.

Read Also : iPhone 16 Pro : ఇది కదా ఆఫర్ అంటే.. ఐఫోన్ 16 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..!

ఒప్పో F29 ప్రో (రూ. 27,999) :
ఒప్పో F29 Pro ఫోన్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. 50MP బ్యాక్ కెమెరా, పవర్‌ఫుల్ ఫుటేజ్‌ను అందిస్తుంది. మరోవైపు, 16MP ఫ్రంట్ కెమెరా వైడ్-యాంగిల్ సెల్ఫీ అందిస్తుంది. భారీ 6000mAh బ్యాటరీతో ఎక్కువ ఛార్జింగ్ టైమ్ అందిస్తుంది. ప్రత్యేకించి ట్రావెల్ కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్.