×
Ad

PAN Aadhaar Link : డెడ్‌లైన్ దగ్గరపడుతోంది మిత్రమా.. అర్జెంట్‌గా మీ ఆధార్-పాన్ లింక్ చేసుకోండి.. సెప్ట్ బై స్టెప్ గైడ్..!

PAN Aadhaar Link : మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేశారా? ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..

Aadhaar And Link PAN Online

PAN Aadhaar Link : ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేశారా? ఇంతకీ మీ ఆధార్ కార్డు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయాలో తెలుసా? 2025 ఏడాది ముగిసే సమయానికి ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అయి ఉండాలి. అంతేకాదు.. మీ ఆధార్ కార్డులో ఏదైనా వివరాలను సరిగ్గా అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. ప్రభుత్వ పరంగా కూడా అందాల్సిన ప్రయోజనాలను కోల్పోతారు.

పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను (PAN Aadhaar Link) సరిగ్గా లింక్ చేసుకోవాలి. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేందుకు గడువు డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే ఉంది. అప్పటివరకూ వేచి ఉండకుండా ముందుగానే మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇంతకీ ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Unclaimed Funds : బిగ్ అలర్ట్.. బీమా పాలసీలో మీ పేరుతో డబ్బు ఉందా? అర్జెంట్‌గా చెక్ చేయండి.. అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ ఇలా తెచ్చుకోండి!

మీ ఆధార్‌ ఈజీగా డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

  • ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం చాలా ఈజీ.
  • మీ ఫోన్‌లో UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • My Aadhaar మెను కింద ‘Download Aadhaar’ ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ (EID), వర్చువల్ ఐడి (VID)తో ఆధార్‌ను పొందవచ్చు.
  • ఆప్షన్ ఎంచుకున్నాక ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చా, OTP రిక్వెస్ట్ ఎంచుకోండి.
  • OTP నేరుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేశాక యూఐడీఏఐ మీ ఇ-ఆధార్ PDF ఇన్‌స్టంట్ జనరేట్ చేస్తుంది.
  • ఫైల్ పాస్‌వర్డ్-ప్రొటెక్షన్ ఉంటుంది.
  • మీ పాస్‌వర్డ్ మీ పేరులోని మొదటి 4 క్యాపిటల్ లెటర్స్, మీ పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి.

ఆన్‌లైన్‌లో పాన్‌ ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి? :
మీరు ఇంకా మీ ఆధార్‌ను మీ పాన్‌తో లింక్ చేయలేదా? ఇప్పుడు ఈ ప్రాసెస్ చాలా ఈజీ తెలుసా? (incometax.gov.in) అధికారిక ఆదాయపు పన్ను పోర్టల్‌ విజిట్ చేయడం ద్వారా పూర్తి చేయొచ్చు. క్విక్ లింక్‌ల కింద ‘Link Aadhaar’ ఆప్షన్ ఎంచుకోండి. మీ పాన్, ఆధార్ నంబర్ మీ పేరును ఆధార్ కార్డులో కనిపించే విధంగానే ఎంటర్ చేయండి.

అన్ని వివరాలు సరిపోలిన తర్వాత తర్వాత స్టెప్‌కు వెళ్లండి. కొన్ని సందర్భాల్లో, రెండింటినీ లింక్ చేస్తే కొత్ది మొత్తంలో రుసుము చెల్లించాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ తర్వాత (వర్తిస్తే) మీ రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి. మీ పాన్ ఆధార్ అధికారికంగా లింక్ అయినట్టుగా మీకు కన్ఫార్మేషన్ మెసేజ్ వస్తుంది.