Aadhaar Card Alert : మీ ఆధార్‌లో ఈ సెక్యూరిటీ సెట్టింగ్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త..!

Aadhaar Card Alert : మీ ఆధార్ కార్డు బ్యాంకుతో లింక్ చేశారా? అయితే, తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే.. మీ బ్యాంకులో (Aadhaar Card Users) దాచుకున్న డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. వెంటనే ఇలా చేయండి..

Aadhaar Card Users should update this setting right now to avoid losing money

Aadhaar Card Alert : ప్రస్తుత రోజుల్లో ఆర్థికపరమైన మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రత్యేకించి మీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక స్థితిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు (Aadhaar Cardholders) ను కలిగిన ప్రతి భారతీయ పౌరుడు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ సెట్టింగ్ అప్‌డేట్ చేసుకోవాలి.

లేదంటే.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ బ్యాంక్‌లో ఉన్నప్పటికీ ఆర్థిక నష్టాలకు దారి తీయవచ్చు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) ఆధార్ కార్డులు ఉన్నవారు వేలల్లో డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని టెక్ ఇంజినీర్ జ్యోతి రామలింగయ్య (Jyothi Ramalingaiah) లింక్డ్‌ఇన్‌ (LinkedIn)లో వెల్లడించారు.

Read Also : Lost Aadhaar Card : మీ ఆధార్ కార్డు కోల్పోయారా? ఆన్‌లైన్‌లో కొత్త ఆధార్ ఎలా పొందాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

ఆధార్ వినియోగదారుల పేర్లు, పాస్‌వర్డ్‌లు, OTPలతో కూడిన మల్టీ వెరిఫికేషన్లు అవసరమయ్యే అనేక ఇతర ఆన్‌లైన్ సర్వీసుల మాదిరిగా కాకుండా, AEPS సిస్టమ్ ప్రత్యేక ఫీచర్‌తో వస్తుంది. అయితే, ప్రతి లావాదేవీకి OTP అవసరం లేదు. దీనికి ఆధార్ నంబర్, ఫింగర్‌ఫ్రింట్, OTP, ఐరిస్ అవసరమని గమనించాలి. ఈ సెకండరీ చెక్ లేకపోవడం అనధికార ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ ఆధార్ కార్డులో ఈ కొత్త సెట్టింగ్ ఎనేబుల్ చేశారా? :
ఈ సిస్టమ్ ద్వారా రూ.10వేలు నష్టపోయారని రామలింగయ్య ఫిర్యాదు చేశారు. లావాదేవీని ధృవీకరించడానికి ఆధార్‌ను ఉపయోగించినట్లు బ్యాంక్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని బాధిత వ్యక్తి పేర్కొన్నారు. కాబట్టి, మీ ఆధార్ కార్డ్‌పై బయోమెట్రిక్ లాక్‌ని (mAadhaar) యాప్ ద్వారా ఎనేబుల్ చేసుకోవాలి.

Aadhaar Card Alert

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అందించిన మొబైల్ అప్లికేషన్.. ఇలా చేయడం ద్వారా మీ ఆధార్ వివరాలకు, ప్రత్యేకించి మీ ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్‌లతో కూడిన బయోమెట్రిక్ డేటాకు అదనపు ప్రొటెక్షన్ లేయర్ కలిగి ఉంటుంది. ఒక క్లిక్‌తో AEPS ద్వారా అనేక రకాల పనులను నిర్వహించుకోవచ్చు. ఆధార్ కార్డ్ యూజర్లు డబ్బు కోల్పోకుండా ఉండేందుకు ఇప్పుడే ఈ సెట్టింగ్‌ని అప్‌డేట్ చేసుకోవాలి.

మీ ఆధార్‌లో సెట్టింగ్ ఎనేబుల్ చేయాలంటే..  ఈ కింది విధంగా ఫాలో చేయండి :

* గూగుల్ ప్లే స్టోర్ నుంచి mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
* యాప్ ఎగువన ఉన్న ‘Register My Aadhaar’ కార్డ్ బటన్‌పై నొక్కండి.
* ఇప్పుడు, యాప్ కోసం 4-అంకెల పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.
* మీరు ఆధార్ నంబర్, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత, మీరు OTP ఎంటర్ చేయాలి.
* మీ ఆధార్ కార్డ్‌లో రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు పంపుతుంది.
* మీరు OTP ఫోన్ SMS యాప్‌ని చెక్ చేయవచ్చు.
* OTP ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
* ఈ కిందికి స్క్రోల్ చేసి.. ‘Biometric Lock’పై నొక్కండి.
* లాక్ బయోమెట్రిక్‌పై Tap చేయండి.
* మీరు మళ్లీ సెక్యూరిటీ క్యాప్చాను ఎంటర్ చేసి, ఆపై OTPని ఎంటర్ చేయాలి.
* మీరు OTPని వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్‌లు లాక్ అవుతాయి.

Read Also : Aadhaar Update Status : మీ ఆధార్‌లో అప్‌డేట్ చేసిన వివరాల స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు