Aadhaar Update : మీ ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఎలా చేయాలి? ఎక్కడంటే?

Aadhaar Update : ఆధార్ కార్డు అప్‌డేట్ ఇంకా చేయలేదా? ఆధార్ బయోమెట్రిక్స్ తప్పనిసరి.. ఎలా చేయాలి? ఎక్కడికి వెళ్లాలంటే?

Aadhaar Update

Aadhaar Update : ఆధార్ కార్డుదారులకు అలర్ట్.. మీ ఆధార్‌లో బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసుకున్నారా? ఆధార్ కార్డ్  హోల్డర్లు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి. ఇందుకోసం UIDAI నంబర్‌ ద్వారా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ విజిట్ చేయాలి.

Read Also : Vivo V50e : సూపర్ డిస్కౌంట్.. వివో V50e ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

వాస్తవానికి, ఆధార్ అనేది భారతీయ పౌరులకు కేటాయించిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. అంతేకాదు.. ప్రభుత్వ సేవలను పొందాలన్నా ఆర్థిక లావాదేవీల కోసం తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్, బయోమెట్రిక్‌లను లింక్ చేసుకోవాలి. తద్వారా ఫేక్ ఆధార్ వంటి మోసాలను నివారించవచ్చు.

ఫింగర్ ఫ్రింట్ డేటా :
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియలో 10 వేళ్లకు సంబంధించి ఫింగర్‌ఫ్రింట్ స్కాన్ చేయించాలి. అథెంటికేషన్ కోసం ఈ ఫింగర్ ఫ్రింట్స్ వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తి ఐడెంటిటీకి బయోమెట్రిక్స్ తప్పనిసరిగా ఉండాలి.

ఐరిస్ స్కాన్ డేటా :
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం ఐరిస్ స్కాన్ చేయించుకోవాలి. వయస్సు, కొన్ని ఆరోగ్య సమస్యల వంటి కారణాల వల్ల ఫింగర్ ఫ్రింట్ స్కాన్లు సరిగా లేనప్పుడు ఐరీస్ స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవాలి.

బయోమెట్రిక్ అప్‌డేట్ ఎప్పుడు అవసరం? :
5 ఏళ్లు నిండగానే బయోమెట్రిక్ డేటాలో ఫోటో, ఫింగర్‌ఫ్రింట్, ఐరిస్ రెండూ రిజిస్టర్ చేయాలి. అసలు ఆధార్ నంబర్ జారీ అవుతుంది. ఈ రిక్వెస్ట్ అనేది కొత్త ఎన్‌రోల్‌మెంట్ రిక్వెస్ట్ మాదిరిగానే ఉంటుంది.

ఆధార్ కలిగిన వ్యక్తి 15 ఏళ్ల తర్వాత ఫోటో, ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్‌లు తప్పనిసరిగా అన్ని బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించుకోవాలి. ఈ బయోమెట్రిక్ ప్రక్రియకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Read Also : Apple iPhone 14 : వారెవ్వా.. ఐఫోన్ అదుర్స్.. ఇలా చేస్తే.. కేవలం రూ.54,999కే ఐఫోన్ 14 మీ సొంతం..

ఎక్కడ చేయించుకోవాలి? :
ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం UIDAI నంబర్‌తో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెటర్ విజిట్ చేయాలి. అథెంటికేషన్ కోసం ఫింగర్ ఫ్రింట్ లేదా ఐరిస్ స్కాన్‌ ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. ఆధార్ సంబంధిత బయోమెట్రిక్ డేటాను సమర్పించాలి.