Apple iPhone 14 : వారెవ్వా.. ఐఫోన్ అదుర్స్.. ఇలా చేస్తే.. కేవలం రూ.54,999కే ఐఫోన్ 14 మీ సొంతం..
Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14పై అద్భుతమైన ఆఫర్.. స్పెషల్ ఆఫర్లతో ఐఫోన్ 14 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 14 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 14 తక్కువ ధరకే కొనేసుకోండి. 8శాతం తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్ 14 మోడల్ 256GB స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Read Also : Google I/O 2025 : గూగుల్ వార్షిక I/O ఈవెంట్ ఎప్పుడు? లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి? ఏయే అప్‌డేట్స్ ఉండొచ్చంటే?
ఐఫోన్ 14 ధర ఎంతంటే? :
256GB వేరియంట్ రూ. 59,900కు లిస్టు కాగా ఫ్లిప్‌కార్ట్ నుంచి 8శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దాంతో ఐఫోన్ 14 ధర రూ. 54,999కు తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఐఫోన్ ధర మరింత తక్కువకే వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 52,150 డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 1934 ఈఎంఐ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఐఫోన్ 14 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ iOS16 ఆధారంగా రన్ అవుతుంది. 1200 నిట్స్ గరిష్ట ప్రకాశంతో A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. 12MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంటుంది. ఆకర్షణీయమైన ఫొటోలను కూడా తీయొచ్చు.
Read Also : Vivo V50e : సూపర్ డిస్కౌంట్.. వివో V50e ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?
ఈ ఐఫోన్ 3279mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. IP68 రేటింగ్ ద్వారా డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.