Google I/O 2025 : గూగుల్ వార్షిక I/O ఈవెంట్ ఎప్పుడు? లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి? ఏయే అప్‌డేట్స్ ఉండొచ్చంటే?

Google I/O 2025 : గూగుల్ వార్షిక I/O ఈవెంట్ మే 20వ తేదీ రాత్రి మొదలు కానుంది. సరికొత్త టూల్స్ అప్‌డేట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Google I/O 2025 : గూగుల్ వార్షిక I/O ఈవెంట్ ఎప్పుడు? లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి? ఏయే అప్‌డేట్స్ ఉండొచ్చంటే?

Google 2025

Updated On : May 19, 2025 / 10:40 AM IST

Google I/O 2025 : గూగుల్ యూజర్లకు అలర్ట్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వార్షిక డెవలపర్ I/O  (Google I/O 2025) ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఏఐ టెక్నాలజీ డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ సరికొత్త టూల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also : Vivo T3 Pro 5G : వివోనా మజాకా.. వివో T3 ప్రో 5Gపై అదిరిపోయే డిస్కౌంట్.. ఇంత తక్కువలో వస్తుందంటే మిస్ చేయొద్దు..!

గూగుల్ వార్షిక ఈవెంట్ ఎప్పుడు, ఏ సమయంలో జరగనుంది? ఇంకా ఏయే అప్‌డేట్స్ రిలీజ్ చేయనుందో ఓసారి తెలుసుకుందాం.

గూగుల్ I/O 2025 డేట్, టైమ్:
కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని షోర్‌లైన్ యాంఫిథియేటర్‌లో గూగుల్ I/O 2025 ఈవెంట్ జరగనుంది. మే 20న రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది.

గూగుల్ I/O 2025 లైవ్ స్ట్రీమ్ :
గూగుల్ కీనోట్ వంటి సెషన్‌లను గూగుల్ I/O కీనోట్ ల్యాండింగ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్‌లో ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేయనుంది.

జెమిని ఏఐ అప్‌గ్రేడ్స్ :
జెమిని ఏఐ మోడళ్లలో స్మార్ట్ వెర్షన్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్, వర్క్‌స్పేస్ కోసం కొత్త టూల్స్ సైతం రానున్నాయి.

ఆండ్రాయిడ్ 16 ఫీచర్లు :
గూగుల్ ఆండ్రాయిడ్ 16 అతి త్వరలో రిలీజ్ కానుంది. ఈ కొత్త అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్మార్టర్ ఏఐ ఏజెంట్లు :
కోడింగ్, వెబ్ రీసెర్చ్ వంటి టాస్కులను పూర్తి చేసే న్యూ ఏఐ ఏజెంట్లను గూగుల్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏఐ (Gems)కు సంబంధించి కూడా అప్‌గ్రేడ్స్ త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Read Also : Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. మడతబెట్టే ఫోన్ మీకోసమే.. ఏకంగా రూ. 12వేలు తగ్గింపు..!

XR హెడ్‌సెట్ :
ఎక్స్ఆర్ (XR) హెడ్‌సెట్‌ డెవలప్ చేసేందుకు గూగుల్ శాంసంగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జెమిని ఏఐ స్మార్ట్ గ్లాసెస్ లేదా హెడ్‌సెట్‌లో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు.