Vivo T3 Pro 5G : వివోనా మజాకా.. వివో T3 ప్రో 5Gపై అదిరిపోయే డిస్కౌంట్.. ఇంత తక్కువలో వస్తుందంటే మిస్ చేయొద్దు..!
Vivo T3 Pro 5G : వివో ఫోన్ కొంటున్నారా? వివో T3 ప్రో 5G అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T3 Pro 5G
Vivo T3 Pro 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో వివో 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. రూ.25వేల లోపు స్టైలిష్ ఫోన్ కోసం చూస్తుంటే.. వివో T3 ప్రో 5G కొనేసుకోవచ్చు. వీగన్ లెదర్ ఫినిష్, కర్వ్డ్-ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 4,500 నిట్స్ బ్రైట్‌నెస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,500 లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. వివో T3 ప్రో 5G డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివో T3 ప్రో 5G ధర :
వివో T3 ప్రో 5G ధర రూ.2వేలు తగ్గింది. ప్రస్తుతం రూ.22,999కి లిస్ట్ అయింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.3,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా రూ.19,499కు అందుబాటులో ఉంది.
కొనుగోలుదారులు రూ.3,834 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందొచ్చు. మీ పాత ఫోన్ రూ. 13,350 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో మరింత సేవ్ చేయొచ్చు.
వివో T3 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో T3 ప్రో 5G ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ HD+ 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశం, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 SoC ద్వారా అడ్రినో 720GPU 8GB వరకు LPDDR4x ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
OISతో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, EISతో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాతో వస్తుంది.
Read Also : iPhone 16e Price : అదిరిపోయే ఆఫర్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16e ధర.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
వివో T3 ప్రో 5G ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, 5,500mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్OS 14పై రన్ అవుతుంది. రెండేళ్ల OS అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అందిస్తుంది.